దేవర సినిమాలో సౌత్ క్వీన్ సాయి పల్లవి కూడా నటించబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ పుకార్లపై స్వయంగా దేవర సినిమా టీమే స్పందించింది.
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో గతంలో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాలకు తగ్గట్టు సినిమాలో భారీ తారాగణం కూడా విశేషం. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకార్ రాజ్, షినే టామ్ చాకో వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఇక, ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా తెగ చక్కర్లు కొడుతోంది. దేవర సినిమాలో సౌత్ క్వీన్ సాయి పల్లవి కూడా నటించబోతోందన్న ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో సినిమాలో సాయి పల్లవి నటిస్తోందని తెలిసి తెగ సంతోష పడిపోతున్నారు. అయితే, దేవర సినిమాలో సాయి పల్లవి నటించబోతోందన్న వార్తల్లో నిజం లేదని తేలింది. ఆ వార్తలు ఒట్టి పుకార్లేనని తెలియవచ్చింది.
ఇక, ఈ పుకార్లపై స్వయంగా దేవర సినిమా టీమే స్పందించింది. తమ సినిమాలో సాయి పల్లవి నటించటం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు దేవర అఫిషియల్ ట్విటర్ ఖాతాలో సమాధానం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ట్వీట్‌ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ గ్రూపుల్లో తెగ వైరల్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ దేవర సినిమాలో సాయి పల్లవి లేదని తెలిసి తెగ బాధపడుతున్నారు. సాయి పల్లవిని తమ హీరోతో చూసి ఆనందాలని అనుకున్నామని, తమకు నిరాశ ఎదురైందని కామెంట్లు చేస్తున్నారు.
Here is the Clarification about the rumour of Sai Pallavi would act in #Devara!!
A Big NO. Tweet Deleted 😂😂@tarak9999 @DevaraMovie https://t.co/B7UFflkMNS
— NTR Fans Guntur (@NTRFansGuntur) June 26, 2023