లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ దుమ్ము దులుపుతుంది నయనతార . పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నయనతార. ఎప్పుడో విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోవాల్సిన నయనతార ఇంతవరకు చేసుకోలేదు. ఈ జంట గురించి నెటిజన్లకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? శివన్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నయన్ కి విగ్నేష్ ఇచ్చిన మొదటి బహుమతి ఏంటి అనే సమాధానాలకు శివన్ సమాధానాలను తెలియజేశాడు. వృత్తిపరంగా దర్శకుడైన శివన్ గురించి కాకుండా చాలామంది నయనతార గురించి మాట్లాడటంతో తనకు ఏమాత్రం అసూయ లేదని మొహమాటం లేకుండ చెప్పేసాడు. అదేవిధంగా నయనతార ఎంతో అందంగా ఉన్నప్పటికీ ఫేవరెట్ హీరోయిన్ మోనికా బెల్లూచి అని ఈ సందర్భంగా విగ్నేష్ అభిమానులకి తన ‘ఫ్యాన్’ గురించి చెప్పేసాడు.
నయనతారతో కలసి సిల్వర్ స్క్రీన్ పంచుకోవాలనేది తన కోరిక అని, నయనతార నటించిన సినిమా “నానుమ్ రౌడీదాన్” లోని ‘తంగమే’ అనే పాటకు లిరిక్స్ రాశాననని వివరించాడు. ఆమెకు ఇచ్చిన తొలి బహుమతి ఈ పాట అని విగ్నేష్ తెలిపాడు. అదేవిధంగా నయనతార చీరకట్టులో ఉంటే తనకెంతో నచ్చుతుందని, పెళ్ళి విషయానికి వస్తే చాలా ఖర్చు అవుతుంది కనుక డబ్బులను కూడపెడుతున్నామని మనసులోని మాటని బైటికి చెప్పేసాడు.