పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికే భార్యాభర్తలు వారి మధ్య తలెత్తే గొడవల కారణంగా విడిపోయి బ్రతకడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇరువురి మధ్య సఖ్యత లోపించడంతో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకుంటున్నారు. కాగా ఈ విడాకులు పెళ్లైన ఎన్ని రోజులకు తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. జీవితంలో ఎన్నో ఆశలు, ఆశయాలతో వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు యువతీ యువకులు. నేటి కాలంలో కొంత మంది ప్రేమ పెళ్లిల్లు చేసుకుంటుంటే, మరికొంత మంది పెద్దలు కుదిర్చిన సంబంధాలను చేసుకుంటున్నారు. అయితే ప్రేమ పెళ్లి అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి ఆ జంటలు విడిపోయేందుకు బాటలు వేస్తున్నాయి. ఈ క్రమంలో విడాకులు తీసుకునే జంటలు ఎక్కువై పోతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తుల వరకు వైవాహిక బంధంతో విసిగిపోయి విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. కాగా అసలు కొత్తగా పెళ్లైన దంపతులు ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు? పెళ్లైన నెల రోజులకే విడాకులు తీసుకోవడం సాధ్యమవుతుందా? ఛట్టం ఏం చెబుతోంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పెళ్లి చేసుకుని నూరేళ్లు కలిసి జీవించాల్సిన దంపతుల జీవితాలు మూన్నాళ్ల ముచ్చటగా తయారవుతోంది. వివాహాలు చేసుకున్న కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్దలు విడిపోయేందుకు దారితీస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అభిరుచులు కలవకనో, అభిప్రాయాలు కుదరకనో విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. కలిసి బ్రతికే పరిస్థితులు వారి మధ్య లేనప్పుడు పరస్పర అంగీకారంతో విడిపోవచ్చు. అయితే ఈ విడాకుల ప్రక్రియ కుటుంబసభ్యుల మధ్య లేదా పెద్దమనుషుల మధ్య జరిగేది కాదు. చట్టానికి లోబడి భార్యాభర్తలు విడాకులు పొందాల్సి ఉంటుంది. కాగా కొత్తగా పెళ్లైన వారు విడాకులు ఎన్ని రోజులకు తీసుకోవాలనేది సందేహాత్మకంగా మారింది.
ఈ క్రమంలో కొత్తగా పెళ్లైన వారు వారం రోజుల్లో విడాకుల కోసం కోర్టులో అప్లై చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. కాగా కోర్టు భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేసేందుకు ఆరు నెలల గడువు ఇస్తుంది. ఈ గడువు ఎందుకంటే ఆ భార్యాభర్తలు మనసు మార్చుకుని మళ్లీ కలిసి జీవించేందుకు అవకాశం కలుగుతుందని కోర్టు భావిస్తుంది. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం విడాకులు, విడిపోవడం ఈ చట్టం కిందికే వస్తాయి. నవ దంపతులు న్యాయ పరంగా విడిపోవాలనుకున్నప్పుడు కోర్టును ఆశ్రయించి విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత భార్యాభర్తల పరస్పర అంగీకారంతో కోర్టు విడాకులను మంజూరు చేస్తుంది.