ఇటీవల సినిమా రంగంలో విడాకుల కల్చర్ విపరీతంగా పెరిగింది. హృతిక్ రోషన్-సుహానే ఖాన్, అమీర్ ఖాన్-కిరణ్ రావ్, నాగ చైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకున్నారన్న వార్త.. అభిమానుల్లో తీవ్ర కలవర పాటుకు గురి చేసింది.
ఇటీవల సినిమా రంగంలో విడాకుల కల్చర్ విపరీతంగా పెరిగింది. హృతిక్ రోషన్-సుహానే ఖాన్, అమీర్ ఖాన్-కిరణ్ రావ్, నాగ చైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకున్నారన్న వార్త.. అభిమానుల్లో తీవ్ర కలవర పాటుకు గురి చేసింది. తాజాగా మెగా కుటుంబ వారసురాలు నిహారిక, చైతన్యలు కూడా విడిపోయినట్లు ప్రకటించారు. అంతలోనే కలర్ స్వాతి, ఆశిన్ వంటి నటీమణులు కూడా ఇదే వరుసలో ఉన్నట్లు వార్తలు రాగా.. ఆ గాసిప్స్‌కు చెక్ పెట్టేశారు వారిద్దరూ. తాజాగా కన్నడ నటి, యాంకర్ అయిన చైత్ర వాసుదేవన్ ఐదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్థి పలికినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు పర్దీన్ ఖాన్, ఆయన భార్య నటాషా మద్వానీ విడాకులు తీసుకున్నారని ఓవార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. నటాషా ప్రముఖ బాలీవుడ్ నటి ముంతాజ్ కూతురు. పర్దీన్-నటాషా 2005 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి దియాని ఇసబెల్లా ఖాన్ (10), అజారియస్ ఫర్దీన్ ఖాన్(6) అనే కుమారుడు ఉన్నారు. వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో ఏడాది నుండి విడివిడిగానే ఉంటున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. పర్దీన్ తన తల్లితో కలిసి ముంబయిలో ఉండగా.. నటాషా మాత్రం లండన్‌లో నివస్తోంది. ఇద్దరి మధ్య గొడవలు తట్టుకోలేని స్థాయికి వెళ్లడంతో పాటు పరిష్కరించుకోలేని దశలో ఉండటంతో విడిపోవడమే బెటర్ అని భావించి.. ఈ నిర్ణయం తీసుకున్నారట. పర్దీన్ చివరిసారిగా 2010లో వచ్చిన దుల్హా మిల్ గయా సినిమాలో కనిపించాడు. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమయంలో ఈ చేదువార్త వినిపిస్తోంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పర్దీన్.. తన జీవితంతో ఎదుర్కొన్న సమస్యలు చెప్పారు. పెళ్లైన తర్వాత తమకు చాన్నాళ్ల వరకు పిల్లలు కలగలేదని, తమకు ఓ ఫ్యామిలీ కావాలనిపించి ఇక్కడ డాక్టర్లను సంప్రదిస్తే.. చేదు అనుభవం ఎదురైందని చెప్పారు. కేవలం పిల్లల కోసమే 2011లో తాము లండన్ షిఫ్ట్ అయ్యామని, సంతాన సమస్యలు ఉండటంతో డాక్టర్‌ను సంప్రదించామని చెప్పారు. ఐవీఎఫ్(ఇన్‌వెట్రో ఫర్టిలైజేషన్) ద్వారా నటాషా గర్భంలో కవలలను ఉంచారు వైద్యులు. కానీ ఆరో నెలలోనే వారిద్దరూ కడుపులోనే చనిపోయారని, ఆ సమయం తమకు ఎంతో క్లిష్టంగా గడిచిందని తెలిపారు. ఆ తర్వాత కొడుకు, కుమారుడు జన్మించారని చెప్పారు. పాప పుట్టినప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగిందన్నారు. ఇప్పుడు ఈ జంట 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారు.