ఆస్కార్ సక్సెస్‌తో మెగా ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ సమయంలో మరో గుడ్ న్యూస్ ఆ ఫ్యామిలీకి సంతోషంతో పాటు గర్వించేలా చేస్తోంది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన అరుదైన ఘనత సాధించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్.సి రెడ్డి మనవరాలిగా, మెగా ఇంటి కోడలిగా ఆమె అందరికీ తెలుసు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా రామ్ చరణ్-ఉపాసనకు పేరుంది. ఒకవైపు సినిమాలతో బిజీబిజీగా ఉండే చెర్రీకి అండగా ఉంటూనే.. మరోవైపు అపోలో ఫాండేషన్ వైస్ చైర్‌పర్సన్‌గానూ ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో తనదైన సేవచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉప్సీ. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ‘మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23’ జాబితాలో ఉపాసన చోటు దక్కించుకున్నారు.
ఉపాసనకు దక్కిన అరుదైన ఘనత గురించి తెలిసిన మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఆస్కార్ విజయంతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న మెగా ఫ్యామిలీకి ఇది మరో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీంతో నెటిజన్స్, మెగా ఫ్యాన్స్, సెలెబ్రిటీలు అందరూ మెగా కోడలిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఉపాసన చేసిన సేవలకు గానూ ఈ పురస్కారం లభించిందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఉప్సీ. పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌ను సక్రమంగా నిర్వహిస్తున్న వారి లిస్టులో ఉపాసన ఒకరని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ఇక, చెర్రీ-ఉప్సీలు త్వరలో పేరెంట్స్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
Thank u @EconomicTimes for featuring me as one of the Most Promising Business Leaders of Asia 2022-23. pic.twitter.com/fP39b2zQTi
— Upasana Konidela (@upasanakonidela) March 23, 2023