సాధారణ మెజీషియన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా ప్రూవ్ చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్. ఒక పక్క షోలు చేస్తూనే, మరో పక్క సినిమాల్లో కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుధీర్‌గా మనకి దగ్గరైన సుధీర్ ఆ షో నుండి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోస్ నుండి కూడా ఆయన తప్పుకున్నారు. ఇక ఈటీవీకి టాటా చెప్పేసి.. స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్స్, పార్టీ చేద్దాం పుష్ప, జీతెలుగులో థాంక్యూ దిల్‌సే వంటి షోలు చేసుకుంటున్నారు. దీంతో సుధీర్‌కి, షో నిర్వాహకుల మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. అయితే సుధీర్ వాటిని ఖండించారు. కట్ చేస్తే సుధీర్ మళ్ళీ ఈటీవీ షోలో కనిపించారు.
27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ యాజమాన్యం ‘భలే మంచి రోజు’ పేరుతో భారీ ఎత్తున సెలబ్రేషన్‌ను ప్లాన్ చేసింది. ఈ సెలబ్రేషన్స్‌లో ఈటీవీ సీరియల్స్, ప్రోగ్రామ్‌లు, షోలు వంటి వాటిలో నటించిన ఆర్టిస్టులందరూ పాల్గొన్నారు. యమున, జాకీ, హరిత వంటి సీరియల్ ఆర్టిస్టులు, నటి ఇంద్రజ, యాంకర్ అనసూయ, అలీ, పోసాని కృష్ణమురళీ, సుధీర్, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది వంటి కమెడియన్లు ఈ సెలబ్రేషన్స్‌లో రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రోమోలో సుధీర్ ఎంట్రీ మాత్రం బాగా హైలైట్ అయ్యింది. దీంతో ఈటీవీ సెలబ్రేషన్స్‌లో భాగంగానే సుధీర్ ఈ షోలో పాల్గొన్నారా? లేక సుధీర్ రీఎంట్రీకి ఇది ట్రైలర్ వెర్షనా? అని సుధీర్ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రదీప్ హోస్ట్‌గా చేస్తున్న ఈ షో ఆగస్ట్ 28న ప్రసారం కానుంది. మరి ఈటీవీలో సుధీర్ రీఎంట్రీపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.