హీరోయిన్ తేజస్వి మదివాడ ఓ ప్రముఖ నటిపై సంచలన కామెంట్లు చేశారు. ఆమె తన తాజా చిత్రం ‘కమిట్మెంట్’ సినిమా ప్రమోషన్లలో ఆ నటిపై ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు. తేజస్వి మాట్లాడుతూ.. ‘‘ మనం ఇండస్ట్రీలోకి వచ్చి, ఇండస్ట్రీనే బాలేదనటం కరెక్ట్ కాదు. అందరికీ ఓ సందర్భం వస్తుంది. కమిట్మెంట్ అడిగేదో.. మనతో తప్పుగా ప్రవర్తించేదో.. ఏదో ఒక సందర్భం వస్తుంది. అప్పుడు మనం ఫైట్ చేయాలి. అప్పుడు లొంగిపోయి తర్వాత ఫైట్ చేయకూడదు. అదే నేను నమ్ముతాను. నీకు తప్పు అనిపిస్తే అప్పుడే నాకిది నచ్చలేదని నువ్వు అక్కడినుంచి వెళ్లిపోవాలి. దానికి అర్థం ఉంటుంది. అలా కాదని, చేయాల్సిన తప్పు చేసేసి.. అందరూ నన్ను వాడుకున్నారు. నన్ను మొత్తం నాశనం చేసేశారు. అని గోల చేయటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మనకు తెలియకుండా మనల్ని ఎవరూ ఏం చేయరు. అసలు కమిట్మెంట్ అనేది నీకు ఇవ్వాలని లేకపోతే అసలు నిన్ను అడిగేవాడే ఉండడు. నేను కూడా అలాంటి పరిస్థితి ఫేస్ చేశాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నా’’ అన్నారు. ఇక, తేజస్వి నటించిన ‘కమిట్మెంట్’ సినిమా ఆగస్టు 19న థియేటర్లలోకి రానుంది. తేజస్వితో పాటు అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, శ్రీనాథ్ మాగంటి, సూర్య శ్రీనాస్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ నటిపై తేజస్వి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : వీడియో: పాయల్ రాజపుత్ డ్రెస్సింగ్ పై హీరో సుధీర్ ఫన్నీ కామెంట్!