‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ ద్వారా మనందరికీ సుపరిచితురాలైన హిమజ.. ప్రస్తుతం నటిగా బిజీ బిజీగా గడుపుతున్నారు. టీవీ సీరియల్స్ లోనే కాకుండా, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోస్ లోనూ ఈమె పార్టిసిపేట్ చేశారు. శివమ్, నేను శైలజ, జనతా గ్యారేజ్ ఇలా చాలా తెలుగు సినిమాల్లో ఈమె నటించారు. అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. యూట్యూబ్ లో ఇట్స్ హిమజ పేరుతో ఒక ఛానల్ ని కూడా రన్ చేస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా అమ్మాయిలకు ఉపయోగపడే బ్యూటీ టిప్స్ కి సంబంధించిన వీడియోలు, హోమ్ టూర్ వీడియోలు, పండగలకి సంబంధించిన వీడియోలు చేస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. తాజాగా ఆమె అభిమానులకి అవేర్నెస్ కలిగిస్తూ ఒక వీడియోను అప్ లోడ్ చేశారు.
ఇటీవల ఆమె ఇంట్లో ఒక దొంగ దూరాడు. సీసీ టీవీ కెమెరాలు ఉండడంతో హిమజ ఆ దొంగని పట్టుకున్నారు. అయితే ఆ దొంగ మీద జాలితో పోలీసులకి కంప్లైంట్ చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆ దొంగ తన తప్పు తెలుసుకునేలా చేశారు. ఆ తర్వాత పబ్లిక్ కి సీసీ టీవీ కెమెరా ప్రాముఖ్యత గురించి వివరించారు. మన జాగ్రత్తలో మనం ఉండాలని, సీసీ కెమెరా ఉంటే సెక్యూరిటీ ఉంటుందని ఆమె అన్నారు. మరి పబ్లిక్ కి అవేర్నెస్ కలిగించిన హిమజపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.