ఈజీ మనీ కోసం ఈ మద్య కొంతమంది చైన్ స్నాచింగ్, దొంగతనాలు ఇతర దందాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. లగ్జరీ జీవితాలకు అలవాటు పడినవారు ఎక్కువగా ఇలాంటి చోరీలకు పాల్పపడుతుంటారు.
ఈ మద్యకాలంలో చాలా మంది లగ్జీరీ జీవితాలకు అలవాటు పడి దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఇతర దందాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. దొరికితే దొంగ.. లేదంటే జల్సారాయుళ్లా జీవితాన్ని గడుపుతున్నారు. సాధారణంగా ఎవరి ఇంటికైనా దొంగతనానికి ఆయుధాలతో బెదిరించి సర్వం దోచుకు వెళ్తారు. కొన్నిసార్లు ఇంటియజమానులు ధైర్యం చేసి దొంగను ఎదిరించి పోరాతుంటారు. ఒకవేళ దొంగతనానికి వచ్చిన దొంగ దొరికితే చితక్కొట్టి పోలీసులకు అప్పగిస్తుంటారు. కానీ ఓ కాలనీలో దొంగతనానికి వచ్చిన దొంగకి పుట్టిన రోజు వేడుకలు చేసి అతనిచే కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ విచిత్ర ఘటన ఢిలీలో చోటు చేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక రెసిడెన్షియల్ అపార్టమెంట్ లోకి దొంగ చొరబడ్డాడు. మెల్లిగా తన పని తాను చేసుకొని వెళ్లిపోదాం అనుకునేలోపు కర్మకాలి దొరికిపోయాడు. ఇంకేముంది నా పని అయిపోయిందిరా దేవుడా అని దొంగ బాధపడుతున్న సమయంలో అతనికి షాక్ ఇచ్చారు. అతన్ని దండించకుండా పుట్టిన రోజు వేడుకలు చేసి అందరూ హ్యాపీ బర్త్ డే చెప్పారు. వివరాల్లోకి వెళితే.. న్యూ ఢిల్లీలో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. సీసీటీవీ కెమెరాల ద్వారా వారిని గుర్తించారు ఆ రెసిడెన్షియల్ కాలనీ వాసులు. వారిని పట్టుకునే ప్రయత్నం చేసేలోపు అందులో ఇద్దరు దొంగలు పారిపోయారు.
ఇక ఒక దొంగ మాత్రం దొరికాడు.. అతన్ని పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేయగా దొంగ బోరున విలపించడం మొదలు పెట్టాడు. దీంతో ఎందుకు ఏడుస్తున్నావని కాలనీ వాసులు అడగడంతో ఈ రోజు తన పుట్టిన రోజు.. దయచేసి తనని వదిలివేయాలని ప్రాదేయపడ్డాడు. దీంతో ఆ కాలనీ వాసులకు దొంగపై జాలి కలిగింది.. అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. వెంటనే ఓ కేక్ తెప్పించి దొంగచే కేక్ కట్ చేయించారు. కేక్ కట్ చేసే సమయంలో అతను తెచ్చిన కట్టర్ ని కూడా ఫోటోలో కనిపించేలా చేశారు.. ఇది ఇతని జీవనాదారం అంటూ కామెంట్స్ చేశారు. తర్వాత పోలీసులు రాగానే అప్పగించారు. వాస్తవానికి ఈ వీడియో పాతదే అయినా.. ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.