64 కళల్లో చోర కళ ఒకటి అంటారు. ఇది కళమే కానీ.. దీన్నే నమ్ముకుని పబ్బం గడుపుకుంటున్నారు దొంగలు. వీరి ఆగడాలకు హద్దు, అదుపు ఉండటం లేదు. వీరి తెలివితేటలతో మూడు కంటికి కూడా తెలియకుండా డబ్బులు కాజేస్తున్నారు. కొంత మంది ఇంట్లో చొరబడి దొంగతనాలు
64 కళల్లో చోర కళ ఒకటి అంటారు. ఇది కళమే కానీ.. దీన్నే నమ్ముకుని పబ్బం గడుపుకుంటున్నారు దొంగలు. వీరి ఆగడాలకు హద్దు, అదుపు ఉండటం లేదు. వీరి తెలివితేటలతో మూడు కంటికి కూడా తెలియకుండా డబ్బులు కాజేస్తున్నారు. కొంత మంది ఇంట్లో చొరబడి దొంగతనాలు చేస్తుంటే..మరి కొంత మంది కేటుగాళ్లు అత్యాధునిక డివైజ్‌లను ఉపయోగించుకుని ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్నారు. అయితే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నా.. చిన్న మిస్టేక్ వీరిని పట్టించేస్తుంది. ఎన్ని తెలివి తేటలు ప్రదర్శించినా.. పోలీసుల ముందు వీరి పప్పులేమీ ఉడకడం లేదు. ఇదే నిరూపితమైంది ఈ దొంగల విషయంలో. దోచేసుకున్నామనుకున్నారు.. కానీ అంతలోనే దొరికిపోయారు.
నల్గొండ జిల్లాలో ఓ దొంగల ముఠా ఏటీఎం చోరీకీ ప్లాన్ చేసింది. అయితే ఏటీఎంలో సీసీటీవీ కెమెరాలు ఉంటాయని గ్రహించిన దొంగలు.. తమ ముఖాలు కనిపించకుండా టోపీలతో,కర్చీఫ్‌లతో కవర్ చేసుకుని.. బ్లాక్ పెయింట్ తీసుకు వచ్చి కెమెరాలపై స్ప్రే చేశారు. ఏటీఎంలోని రూ. 23 లక్షల నగదును దోచుకెళ్లారు. అయినా సరే పోలీసులకు దొరికిపోయారు. ఎలా అనుకుంటున్నారా.. అన్ని సీసీటీవీ కెమెరాలకు బ్లాక్ పెయింట్ స్ప్రే చేశారు కానీ ఓ కెమెరాకు కొట్టడం మర్చిపోయారు. దీంతో వీరి బండారం బయటకు వచ్చింది. ఆ కెమెరాలో రికార్డు అయిన వీడియో ప్రకారం.. దొంగలను పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియోలో ఓ ముసుగు ధరించి ఏటీఎంలోకి వెళ్లిన దొంగ.. బ్లాక్ పెయింట్ తీసుకుని అన్ని సీసీటీవీ కెమెరాలపై చల్లాడు కానీ ఒకటి మర్చిపోయాడు. అనంతరం బయటకు వెళ్లి పోయాడు. కొంత సేపటి తర్వాత ముసుగు ధరించిన ఐదుగురు దొంగలు ఏటీఎంలోకి ప్రవేశించారు. అందులో రెండు ఏటీఎంలు ఉండగా.. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ తో ఒక దాన్ని ఓపెన్ చేశారు. అందులో ఉన్న రూ. 23 లక్షలను దోచుకెళ్లారు. ఇంకో దాన్ని పగుల గొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ వారి వల్ల కాలేదు. ఇక లేటు చేస్తే దొరికిపోతామని అనుకున్నారో.. లేక దోచుకున్న సొమ్ము చాలు అనుకున్నారో తెలియదు కానీ అక్కడి నుండి వ్యానులో పరారయ్యారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
Rs 23 lakhs stolen from #SBI ATM at Aitipamula of Kattangur mandal in #Nalgonda district pic.twitter.com/knN25bYCyV
— సందీప్ ఎరుకల Sandeep Erukala (@Esandeep97) July 30, 2023