ఒంటరిగా ఉంటున్న మహిళపై దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఆ మహిళ చూపిన తెగువకు దొంగపారిపోయాడు.
ఈజీ మనికి అలవాటు పడిన కొందరు వ్యక్తులు దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఏ పని చేయకుండా దర్జాగా డబ్బు సంపాదించాలని అడ్డదార్లు తొక్కుతున్నారు. జల్సాలకు అలవాటు పడిన కొందరు వారి అవసరాలను తీర్చుకునేందుకు దొంగలుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దొంగతనాన్ని నిలువరించిన వారిపై దాడులకు పాల్పడుతూ వారిని అంతమొందించడానికి సైతం వెనకాడట్లేదు దొంగలు. ఈ క్రమంలో తెలంగాణలోని వేములవాడలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అర్థరాత్రి వేళ దొంగతనానికి వచ్చిన దుండగుడు ఆమె పై దాడికి యత్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పటిష్టమైన పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో అమలవుతున్నప్పటికి దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికితే కటకటాలపాలు అవుతామని తెలిసి కూడా నేరాలకు పాల్పడుతున్నారు దుండగులు. ఈ క్రమంలో వేములవాడలోని భగవంత్ రావు నగర్ లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్ లో ఉండటంతో ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురుకు పెళ్లి చేశారు. చిన్న కూతురు అమెరికాలో ఉంటుంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన దుండగుడు అర్థరాత్రి వేళ ఆమె ఇంటికి చేరాడు. ఇంటి గోడపక్కన నక్కి అదును కోసం చూడసాగాడు.
ఆ సమయంలో బయటికి వచ్చిన ఆ మహిళకు ఏదో శబ్ధం వినిపించి పక్కకు తొంగి చూడగా ముసుగు ధరించిన దొంగ కనిపించాడు. వెంటనే అలర్ట్ అయిన దొంగ మహిళపై దాడికి యత్నించాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన మహిళపై దాడి చేసి బంగారం అపహరించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఆమె దొంగ చేతికి చిక్కకుండా నిలువరించింది. భయంకరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యం చేసి దుండగుడిని ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో దుండగుడు ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీలత. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
వేములవాడలో మహిళపై దాడి చేసిన దొంగ .. ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ
వేములవాడ – భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె మొదటి కూతురుకు వివాహం కాగా, రెండో కూతురు అమెరికాలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి దొంగతనానికి యత్నించాడు.
శ్రీలత… pic.twitter.com/TSl6uZTTkQ
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2023