బుల్లితెరపై ఎన్నో వినూత్న వినోదాత్మక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటివి ఉన్నప్పటికీ.. ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అదే బాటలో తాజాగా ‘మిస్టర్ & మిసెస్’ అనే రియాలిటీ షో మొదలైంది. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ప్రతి మంగళవారం రాత్రి ప్రసారం అవుతున్న ఈ షోకి సంబంధించి.. తాజాగా కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
ఇక షో పేరు ‘మిస్టర్ అండ్ మిసెస్’ అయినప్పటికీ, వారానికో కొత్త థీమ్ తో ప్లాన్ చేస్తున్నారు. వచ్చేవారానికి సంబంధించి ప్రోమో చూసినట్లయితే.. ఈసారి గెటప్ థీమ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే.. గెటప్ థీమ్ ఎపిసోడ్ అని శ్రీముఖి రెగ్యులర్ గా స్టైలిష్ లుక్కులో కాకుండా.. కొత్త గెటప్ లో సర్ప్రైజ్ చేసింది. ఏకంగా అలియా భట్ పోషించిన ‘గంగూబాయ్ కతియావాడి’ గెటప్ లో దర్శనమిచ్చింది. తెల్లటి చీరకట్టుకొని.. నల్ల కళ్లద్దాలు.. నుదుటిపై ఎర్రని బొట్టు ఇలా వేషధారణతో ఆకట్టుకుంది శ్రీముఖి. దీంతో గంగూబాయి గెటప్ లో శ్రీముఖిని చూసి నటుడు శివబాలాజీ కంప్లిమెంట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.