తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బుల్లితెరపై ఎన్నో డిఫరెంట్ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్ పోటీ పడుతున్నాయి. దాదాపుగా అన్ని షోలు కూడా కామెడీనే ప్రధానంగా చేసుకుని రూపొందుతున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బుల్లితెరపై ఎన్నో డిఫరెంట్ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్ పోటీ పడుతున్నాయి. దాదాపుగా అన్ని షోలు కూడా కామెడీనే ప్రధానంగా చేసుకుని రూపొందుతున్నాయి. జనాలను ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. వాటి కారణంగానే ఎంతో మంది యాంకర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫీమేల్ యాంకర్లలో శ్రీముఖి హంగామానే వేరు. ఫుల్ ఎనర్జిటిక్‌గా, జోష్‌తో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. షోలు, ఈవెంట్స్ ఏదైనా కానీ శ్రీముఖి ఉంటే ఆ హడావిడే వేరు. ఈ బుల్లితెర రాములమ్మ ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రీసెంట్గా కమింగ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. పలు సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన నటీనటులు ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ప్రోమో ఆసక్తికరంగా ఉండడంతో పాటు మరోసారి శ్రీముఖి వార్తల్లో నిలిచేలా చేసింది. ఇక ఈ ఎపిసోడ్లో రెట్రో ఓల్డ్ థీయ్ తీసుకుని ముక్కు అవినాష్ ఆ టైప్ కాస్ట్యూమ్స్‌లో వచ్చాడు. ఫైమా, హరి పంచ్‌లు పేల్చారు. ఇక ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటూ పాత సీరియల్స్‌లోని ఆర్టిస్టులంతా రకరకాల టాస్కులు, పంచ్‌లు, ముద్దులతో రచ్చ రంబోలా చేశారు. శ్రీముఖి అందర్నీ ఓ ఆట ఆడేసుకుంది. ఇక నటీనటులు కూడా ఎవరూ తక్కువ తినలేదు. నానా హంగామా చేశారు. వారి జోష్ చూసి హోస్ట్ కూడా షాక్ అయ్యింది.
ఇంకో హైలెట్ ఏంటంటే.. ప్రోమో మధ్యలో శ్రీముఖి.. ‘పార్థు, ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు’ అంటూ అవినాష్ షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుంది. ఇక మనోడు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే శ్రీముఖిని ముద్దాడడానికి దగ్గరకు జరిగాడు. దీంతో తన స్టైల్లో గూబ గుయ్ మనిపించింది. ఇదంతా సరాదాగానే చేసినా.. శ్రీముఖి, అవినాష్‌ని కొట్టినప్పుడు వచ్చిన సౌండ్ మాత్రం సూపర్ అసలు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురయ్యారు. పెద్దగా నవ్వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.