తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు శరత్ బాబు. ఎలాంటి పాత్రలైనా అవలీలగా నటించిన ఆయన ఎంత గొప్ప నటుడు అయినా.. వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజ నటీనటులు వరుసగా కన్నుమూయడం టాలీవుడ్ ఇండస్ట్రీ కోలుకోలేని విషాదంలో మునిగిపోయింది. ఈ ఏడాది కూడా ప్రముఖ నటులు కన్నుమూశారు. తాజాగా ఇండస్ట్రీలో తన సహజమైన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు శరత్ బాబు కన్నుమూశారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు నటుడు శరత్ బాబు. గతకొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గచ్చిబౌళిలోని ఏఐజి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. శరత్ బాబు వయసు 71 సంవత్సరాలు. నటుడిగా ఆయన కు ఎంత గొప్ప ఆదరణ ఉన్నా.. రియల్ లైఫ్ లో వైవాహిక విషయంలో శరత్ బాబు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు శరత్ బాబు.
ఇండస్ట్రీలో కెరీర్ బిగినింగ్ లో ఆయనకు ప్రముఖ నటి రమాప్రభతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారి 1974 లో ఆమెను వివాహం చేసుకున్నాడు. శరత్ బాబు వయసు 22 సంవత్సరాలు. తొలినాళ్లలో శరత్ బాబు కి సినిమాల్లో అవకాశాల కోసం రమాప్రభ ఎంతోమందికి రికమెండ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. రమాప్రభ-శరత్ బాబు లు 14 ఏళ్ల పాటు కలిసి జీవించారు. తర్వాత అభిప్రాయభేదాలతో 1988లో ఆమెతో విడిపోయారు. రమాప్రభతో విడిపోయిన రెండు సంవత్సరాల తర్వాత తమిళ నటుడు నంబియార్ కుమార్తె స్నేహను 1990 లో ద్వితీయ వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితం కూడా ఎంతో కాలం నిలవలేకపోయింది. ఇద్దరి మద్య మనస్పర్ధల కారణంగా ఇరువురి పరస్పర అంగీకారంతో 2011లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి శరత్ బాబు ఒంటరిగానే జీవిస్తూ వచ్చారు.