బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షోలలో ‘ఎక్సట్రా జబర్దస్త్’ ఒకటి. కొన్నేళ్ల నుండి విజయవంతంగా రన్ అవుతున్న ఈ షోలో .. మొదటి నుండి యాంకర్ గా కొనసాగుతోంది రష్మీ. జబర్దస్త్ షోకి మరో వెర్షన్ లా మొదలైన ఎక్సట్రా జబర్దస్త్.. ప్రేక్షకాదరణతో టాప్ లో కంటిన్యూ అవుతోంది. అయితే.. జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా ఏ కామెడీ షో అయినా జడ్జి స్థానాలలో మాత్రం ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్సట్రా జబర్దస్త్ లో మొన్నటివరకూ సీనియర్ హీరోయిన్స్ ఇంద్రజ, ఖుష్బూ కనిపించారు. కానీ.. ఈ వారం కృష్ణభగవాన్, నటుడు పోసాని కృష్ణమురళీ జడ్జిలుగా కనిపిస్తున్నారు.
ఎక్సట్రా జబర్దస్త్ లో పోసాని కృష్ణమురళీ జడ్జిగా రావడం ఇదే ఫస్ట్ టైమ్. సో.. వచ్చీ రాగానే ఎపిసోడ్ ని చాలా ఎంజాయ్ చేసినట్లు కొత్తగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అయితే.. పోసాని ఏ షోలో పాల్గొన్నా.. ఆయన చేసే హంగామా వేరే లెవెల్ లో ఉంటుంది. డాన్స్ షో, కామెడీ షో ఏదైనా.. పోసానికి పెర్ఫార్మన్స్ నచ్చితే వెంటనే జేబులో నుండి డబ్బులు తీసి బహుమతిగా ఇవ్వడం ఇదివరకే చూశాం. ఇప్పుడు ఎక్సట్రా జబర్దస్త్ లో కూడా కెవ్వు కార్తీక్ టీమ్ లో నరేష్, మరో అమ్మాయి పెర్ఫార్మన్సులు చూసి, అభినందిస్తూ ఇద్దరికీ చెరో రూ. 500 ఇచ్చారు. దీంతో పోసాని ఆర్టిస్టులను ఎంకరేజ్ చేసే విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట తెగవైరల్ అవుతోంది.