ఒక వ్యక్తి రష్మీని రోడ్డు మీదకు తిరగద్దు అంటున్నారు. ఇంట్లో ఉండు, బయటకొస్తే యాసిడ్ పోస్తా అని, చేతబడి చేయిస్తా అని బెదిరించారు. ఎవరా వ్యక్తి? రష్మీని ఎందుకు టార్గెట్ చేశారు?
అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రేమికులు మాత్రం తప్పు బాలుడి పేరెంట్స్ దే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక జంతు ప్రేమికురాలు అయిన యాంకర్ రష్మీ కూడా ఈ ఘటనపై స్పందించింది. మొదటి నుంచి రష్మీ జంతువుల పట్ల ప్రేమగా ఉండాలని పోస్టులు, ట్వీట్లు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో అంబర్ పేట వీధి కుక్కలు దాడిపై స్పందించింది. బాలుడిపై వీధి కుక్కల దాడి బాధాకరమని అంటూనే కుక్కలు కూడా మనలానే ప్రాణులని.. వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలని ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రష్మీకి, నెటిజన్స్ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ఒక నెటిజన్ అయితే ఏకంగా రష్మీని కుక్కని కొట్టినట్లు కొట్టాలని ట్వీట్ చేయగా.. ఆమె అతనికి రిప్లై ఇస్తూ.. నీ అడ్రస్ చెప్పు నన్ను ఎలా ఫేస్ చేయగలవో చూస్తా అని ట్వీట్ చేసింది. ఇక మరొక నెటిజన్ ఏకంగా యాసిడ్ పోస్తా అంటూ రష్మీకి మెసేజ్ పెట్టారు. ‘నీ మీద చేతబడి చేయిస్తా. పాపిష్టి దానా. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్లు అవుతాయా? యాసిడ్ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్ళకు తెలియదు. అన్నీ మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావ్’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
దీన్ని స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గతంలో కూడా ఈ వ్యక్తి తనకు మెసేజ్ పెట్టాడని వెల్లడించింది. ఆ స్క్రీన్ షాట్ లో ‘రష్మీ త్వరగా పెళ్లి చేసుకో. 40 ఏళ్ళు వచ్చాయి. లేటు చేయకుండా పెళ్లి చేసుకో’ అని ఉంది. దీన్ని షేర్ చేస్తూ.. ‘ఈ అకౌంట్ తో గతంలో సమస్య వచ్చింది. నా వయసు, నా పెళ్లి గురించి మెసేజ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఆడనో, మగతనో తెలియదు కానీ నా మీద చేతబడి చేయిస్తాడట. యాసిడ్ పోస్తాడట. నేను పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చా?’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి రష్మీ ట్వీట్ పై మీ అభిప్రాయమేమిటి? ఆ వ్యక్తి రష్మీపై యాసిడ్ పోస్తాననడం, చేతబడి చేయిస్తాననడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
This acc sometime back had a problem with my age nd marriage now he /she wants to do black magic on me and pour acid on me
Shud I be filing a complaint now ??? pic.twitter.com/a6SaQO6Tu4— rashmi gautam (@rashmigautam27) February 25, 2023