తెలుగు టెలివిజన్ రంగంలో వినోదానికి కొదువ లేదు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చినా కానీ.. సీరియల్స్, రియాలిటీ షోస్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్‌ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్నాయి పలు ఛానెళ్లు.
తెలుగు టెలివిజన్ రంగంలో వినోదానికి కొదువ లేదు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చినా కానీ.. సీరియల్స్, రియాలిటీ షోస్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్‌ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్నాయి పలు ఛానెళ్లు. ఎంతోమంది గుర్తింపు తెచ్చుకుని టీవీల నుండి సినిమాల వైపు కూడా వెళ్లారు. ఇక యాంకర్స్ అయితే స్టార్స్ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ముఖ్యంగా రష్మీ గౌతమ్. గ్లామర్, ముద్దు ముద్దుగా మాట్లాడే తెలుగు, బాడీ లాంగ్వేజ్, అంతెందుకు? సింపుల్‌గా స్మైల్‌తో కుర్రాళ్లకి కిక్ ఇస్తుంటుంది. రష్మీ హోస్ట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. సోషల్ మీడియాలోనూ తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి రష్మీని ఓ కమెడియన్ అవమానించాడు అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
రష్మీ హోస్ట్ చేస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆదివారం ప్రసారమయ్యే ఈ షోను ఫ్యామిలీ అంతా కలిసి చూస్తారు. మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుందీ ప్రోగ్రామ్‌కి. కంటెస్టెంట్స్ ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నా కానీ దానిలో కామెడీనే హైలెట్ చేస్తూ అందర్నీ నవ్వించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక రాసుకునే పంచెస్ కన్నా ఒక్కోసారి స్టేజీ మీద ఫ్లోలో వచ్చే పంచెస్ షాక్ ఇస్తుంటాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడం, వాటి ఉద్దేశమేంటో చెప్తూ కవరింగ్ లాంటి క్లారిటీ ఇవ్వడం చేస్తుంటారు.
ఇప్పుడలానే ఆటో రాంప్రసాద్ తన స్కిట్‌లో భాగంగా రష్మీని రాత్రికి రమ్మని పిలిచాడు. దీంతో ‘రాత్రికెందుకు పిలిచారు?’ అనడిగింది. ‘రాత్రికెందుకు పిలుస్తామో తెలియదా మీకు?’ అంటూ మెలికలు తిరిగిపోయాడు. వెంటనే, తనేదో తేడాగా సమాధానం చెప్పేటట్లున్నాడని గ్రహించి.. పక్కనే ఉన్న ఇంద్రజ ‘ఏయ్’ అంటూ గట్టిగా గద్దించినట్లు అరిచారు. ‘అదే, ఊర్లో జాతరొకటి చెయ్యాలి. అందుకే పిలిచామండీ’ అని చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. ఈ ఎపిసోడ్‌కి సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ తనయుడు హీరోగా నటించిన ‘స్లమ్ డాగ్ హస్బండ్’ మూవీ టీం వచ్చారు. బ్రహ్మాజీ కూడా నరేష్‌తో పంచ్‌లేసి నవ్వించాడు.
ఇది కూడా చదవండి : శ్రీముఖికి ముద్దు పెట్టబోయిన అవినాష్! చెంప చెళ్లుమనిపించింది