తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వీధి కుక్కల దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే కుక్కులు వారిపై దాడులు చేసి చంపేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో, గ్రామాల్లో వీధి కుక్కల గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనుకు గురి చేస్తున్నాయి.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైర విహారం మరీ ఎక్కువ అయ్యాయని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఏ క్షణంలో తమపై దాడులు చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని.. ఇప్పటికే పలువురు వీధి కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయపడటమే కాదు.. చనిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే హరిహర కృష్ణ నుంచి పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు.
కొన్ని రోజుల క్రితం అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. తాజాగా మరోసారి మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అంబర్‌పేట్‌కు చెందిన బాలరాజు శనివారం గుండెపోటుతో మరణించారు. పార్టీకి ఎంతో సేవ చేసిన బాలరాజు మృతితో ఆ పార్టీ శ్రేణుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయపడటమే కాదు.. చనిపోతున్న కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అంబర్ పేట్ లో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ ని కుక్కలు దాడి చేసి చంపాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది.
అంబర్ పేట వీధికుక్కల ఘటనలో ప్రదీప్ చనిపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న వర్మ.. కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో ప్రాణాలు వదిలిన చిన్నారి ప్రదీప్ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. దాడి ఘటనపై ట్వీటర్ వేదికగా స్పందించిన వర్మ.. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేయర్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కుక్కల దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిహారంతో పాటు కార్పోరేటర్లు తమ నెల రోజుల వేతనం విరాళంగా ఇవ్వాలని తీర్మానించారు.
అంబర్‌పేట వీధి కుక్కల దాడిలో మృతి చెందిన ప్రదీప్ కుటుంబానికి ఆర్జీవీ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో.. స్వయంగా ఆర్జీవీనే రంగంలోకి దిగాడు. ప్రదీప్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రజలను కోరాడు. ఆవివరాలు..