సుడిగాలి సుధీర్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఆ హాట్ బ్యూటీతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు? ఏంటి సంగతి?
సుడిగాలి సుధీర్.. ఈ పేరు చెప్పగానే టీవీ ఆడియెన్స్ అలర్ట్ అయిపోతారు. టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ‘జబర్దస్త్’ నుంచి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వరకు చాలా అంటే చాలా షోలు చేశాడు. ‘బలగం’ డైరెక్టర్ వేణు స్కిట్స్ లో తొలుత ఓ సాధారణ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సుడిగాలి సుధీర్ పేరుతో టీమ్ లీడర్ అయిపోయాడు. తెగ ఫేమస్ అయిపోయాడు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఈ షోతో ఎంటర్ టైన్ చేసిన సుధీర్.. ప్రస్తుతం హీరోగా కాస్త బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా లడ్డు లాంటి ఛాన్స్ కొట్టేశాడు. ఎందుకంటే అమ్మాయి అలాంటిది మరి.
అసలు విషయానికొచ్చేస్తే.. సాధారణంగా టీవీ యాక్టర్స్ ని సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ గా చూడటానికి జనాలు ఇష్టపడరు. రోజూ టీవీలో చూస్తాం కదా మళ్లీ కొత్తగా చూసేదేముంది అనేస్తారు. అందుకేనేమో ‘జబర్దస్త్’లో చేస్తూనే ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’ సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ అవి ఫెయిలవడంతో ఆలోచనలో పడిపోయాడు. అందుకే షోలన్నింటికీ గ్యాప్ తీసుకుని ‘గాలోడు’ మూవీ చేశాడు. ఇది రొటీన్ కమర్షియల్ మాస్ మసాలా చిత్రం అయినప్పటికీ.. అందులో సుధీర్ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర బాగానే నడిచేసింది. చెప్పాలంటే లాభాలు కూడా బానే వచ్చాయి.
గతేడాది థియేటర్లలోకి ఈ మూవీ వచ్చిన తర్వాత సుధీర్ పెద్దగా ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ ఏం చేస్తున్నాడా అని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు సడన్ గా సుధీర్ నాలుగో మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ‘బ్యాచ్ లర్’ అనే డబ్బింగ్ మూవీ వల్ల తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ దివ్యభారతిని.. సుధీర్ కొత్త మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారు. అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో నెటిజన్స్ తెగ మాట్లాడేసుకుంటున్నారు. సుధీర్ లడ్డులాంటి ఛాన్స్ కొట్టేశాడని అంటున్నారు. ఈ హ్యాటీ బ్యూటీ ఉంది కాబట్టి సినిమాలో అందుకు తగ్గ సీన్స్ కచ్చితంగా ఉంటాయని ఫిక్సయిపోతున్నారు. మరి సుధీర్ మూవీలో దివ్యభారతి హీరోయిన్ గా ఉండటంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
The Exciting Update is here 🤞🤩
Here’s Welcoming the Supremely Gorgeous & Sensational Actress @divyabarti2801 as the Leading Lady of our #SS4 – @sudheeranand‘s Next 📣🥳
@NaresshLee 🎬@MahatejaC @luckymediaoff
More exciting updates soon. pic.twitter.com/1vougxjuR7
— Mahaateja Creations (@MahatejaC) May 11, 2023