ఒక్కడు.. టాలీవుడ్, మహేష్ బాబు కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటీవల రీ రిలీజ్ సందర్భంగా కూడా ఈ సినిమా మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, స్వాగ్, మేనరిజానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిజానికి ఈ సినిమా తర్వాత నుంచే మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆ సినిమాలో ప్రతి సీన్ హైలెట్‌గా ఉంటుంది. ప్రకాశ్ రాజ్ పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రకాశ్ రాజ్‌కు సీరియస్ విలన్‌గా కూడా గుర్తింపు అక్కడి నుంచే బాగా పెరిగింది. అయితే ఇప్పుడు అలాంటి సినిమాని జాతిరత్నాలు షోలో ఇమ్మాన్యుయేల్, నూకరాజు టీమ్ అపహాస్యం చేశారు. వారి స్కిట్‌లో సినిమా స్పూఫ్ చేశారు. అయితే కాస్త హద్దు మీరి ప్రవర్తించారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జాతిరత్నాలు షోలో చిన్న స్కిట్స్ కూడా చేస్తుంటారు. అలా ఈసారి మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా ఒక్కడుని స్పూఫ్ చేశారు. గతంలో కూడా ఎన్నో టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలను స్పూఫ్ చేశారు. కానీ, ఎప్పుడూ మరీ అతిగా చేసినట్లు కనిపించలేదు. కానీ, ఈసారి నూకరాజు కాస్త ఎక్కువ చేసినట్లు కనిపించింది. ఒక్కడు సినిమాలో మహేశ్ బాబు క్యారెక్టర్ నూకరాజు చేశాడు. స్టార్టింగ్ నుంచి ముక్కును వేలుతో తాకుతూ ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు. “మొన్న క్యాలీఫ్లవర్ చేశాడు సంపూర్ణేష్ బాబు.. ఈరోజు నేను మహేష్ బాబు” అంటూ స్టార్ట్ చేశాడు. ఈసారి కబడ్డీ కప్పు కొట్టాలన్నయ్యా అంటూ.. వెటకారంగా చప్పట్లు కొట్టాడు. అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ రెండూ వెటకారానికి మించి ఉన్నాయి.
ఇంక ఇమ్మాన్యుయేల్ కూడా రాగానే భూమిక గురించి డైలాగ్ చెప్పాడు. మొత్తానికి ఈ స్కిట్‌ని గౌరవంగా మాత్రం ప్రెజెంట్ చేయలేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ ప్రోమో చూస్తుంటే ఎక్కడా సినిమాకి గౌరవం ఇచ్చినట్లు, మహేష్ క్యారెక్టర్‌ని చక్కగా ప్రదర్శించిన దాఖలాలు కనిపించలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ క్యారెక్టర్‌ని కావాలనే కించపరుస్తూ చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పూఫ్ అంటే కాస్త కామెడీ చేయచ్చు గానీ.. మహేష్ బాబు క్యారెక్టర్‌నే కించపరుస్తున్నట్లు ఓవర్‌గా నటించారంటూ విమర్శిస్తున్నారు. ఇమ్మాన్యుయేల్, నూకరాజులు ఒక్కడు సినిమాని మరీ ఇంతలా కించపరిచేలా స్కిట్ చేసుండకూడదంటూ కామెంట్ చేస్తున్నారు. మరి.. వీళ్లు కావాలని అలా చేశారా? లేక కామెడీ పండించడం కోసం ఆ లైన్ క్రాస్ చేశారో తెలియాల్సి ఉంది.