బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా బాగా ఫేమస్ అయిన ప్రియాంక సింగ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తన కాబోయే భర్త ఎవరు? పెళ్లి తేదీ ఎప్పుడు? ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది. తన పెళ్ళికి సంబంధించిన షాపింగ్ చేస్తున్నా అని ఒక వీడియో కూడా అప్లోడ్ చేసింది.
సెలబ్రిటీలకు సంబంధించిన పెళ్లి వార్తలు నెట్టింట చక్కెర్లు కొడుతుంటాయి. వారి పెళ్లిళ్ల గురించి సెలబ్రిటీల కంటే ఎక్కువగా జనాలే ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ పెళ్లి గురించి కూడా ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 5తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న పింకీ ఆ మధ్య పసుపు రంగు లెహంగాలో పెళ్లి కూతురిలా ముస్తాబై కనిపించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలను షేర్ చేసింది. దీంతో పింకీ పెళ్లి నిజం అనుకున్నారు అంతా. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేస్తుందని అనుకున్నారు. కానీ ఈ విషయంపై పింకీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంపై ఆమె స్పందించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చింది.
తన యూట్యూబ్ ఛానల్ లో నా పెళ్లి జ్యూయలరీ షాపింగ్ పేరుతో ఒక వీడియోను అప్లోడ్ చేసింది. తన పెళ్లి ఫిక్స్ అయ్యిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని పేర్కొంది. తన పెళ్లి కోసమే నగల షాపింగ్ చేస్తున్నానని వెల్లడించింది. అందరూ తన పెళ్లి గురించి ఎదురుచూస్తున్నారని.. కాబోయే భర్త ఎవరని అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తా అని అంది. వీడియో చివరన తన కాబోయే భర్త ఎవరో చెప్తానని, ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది ఆఖరున చెప్తానని వెల్లడించింది. పెళ్ళికి సంబంధించిన నగల షాపింగ్ చేశాక ఆఖరున తన పెళ్లి తేదీ వెల్లడించింది. 2024 ఫిబ్రవరి 30న తన పెళ్లి అని, అందరూ తప్పకుండా రావాలని ఆహ్వానించింది. ఏంటి షాక్ అయ్యారా? ఫిబ్రవరి నెలలో 30 ఉండదు కదా అని ఆలోచించారా? అవును ఫిబ్రవరి నెలలో 30 ఎలా అయితే ఉండదో ప్రస్తుతానికి తన జీవితంలో పెళ్లి కాన్సెప్ట్ ఉండదు అని చెప్పకనే చెప్పింది.
ఈ నగల షాపింగ్ తన పెళ్లి కోసం కాదని, తన స్నేహితురాలి పెళ్లి కోసమని వెల్లడించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై ఎలాంటి నిజం లేదని, ఇది కేవలం ప్రాంక్ వీడియో మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది. అదన్నమాట విషయం. కానీ పింకీ వ్యవహారంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. పిచ్చోళ్ళని చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య పెళ్ళికూతురిలా ముస్తాబై పెళ్లి చేసుకుంటుందేమో అనేలా హడావుడి చేసింది. ఇప్పుడు నా పెళ్ళికి నగల షాపింగ్ అంటూ వీడియో పెట్టి పిచ్చోళ్లను చేసిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది అభిమానులు నిజంగానే పెళ్లి అనుకుని అభినందనలు తెలియజేశారు. వీడియో ఆఖరి వరకూ చూసినవారు డిజప్పాయింట్ అయ్యారు. నీ ఫ్యాన్స్ ని ఇలా ప్రాంక్ వీడియోలు చేసి హర్ట్ చేయకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రియాంక సింగ్ తన పెళ్లి అంటూ హడావుడి చేసి ఆఖరున తూచ్ అనడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.