సుడిగాలి సుధీర్ అనగానే మీకు గుర్తొచ్చేది రష్మీనే. ఎందుకంటే వీళ్లు జోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. దాదాపు కొన్నేళ్ల పాటు టీవీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన ఈ కాంబో.. ప్రస్తుతానికి ఎవరికి వారు డిఫరెంట్ ఛానెల్స్ లో షోలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. సుధీర్ అయితే హీరో కూడా అయిపోయాడు. ఇలా స్క్రీన్ పై వీళ్లిద్దరూ కలిసి కనిపించకపోయినప్పటికీ.. చాలాసార్లు వీళ్లు ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోల్లో రష్మీని ఆటపట్టించడం కోసం కొన్నిసార్లు సుధీర్ పేరు బయటకు తీస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే మాట్లాడారు. కానీ అది కాస్త శృతి మించిందేమో అనిపించేలా ఉంది.
ఇక విషయానికొస్తే.. ‘జబర్దస్త్’లోకి తొలుత ఓ కమెడియన్ గా వచ్చిన సుధీర్, టీమ్ లీడర్ గా మారి సుడిగాలి సుధీర్ అయ్యాడు. లక్షలాది మంది ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోయాడు. ఇక ఇదే షోకు యాంకర్ గా వచ్చిన రష్మీ కూడా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. గతేడాది ‘జబర్దస్త్’ నుంచి సుధీర్ బయటకెళ్లిపోయిన తర్వాత ఈ కాంబోని చూసే అవకాశం ప్రేక్షకులకు రావడం లేదు. వీళ్లిద్దరి మధ్య నిజంగా లవ్ ఉందా లేదా అనేది పక్కనబెడితే.. ఆడియెన్స్ మాత్రం సుధీర్-రష్మీ కలిసి కనిపిస్తే చాలు, హ్యాపీగా ఉంటుందని భావిస్తుంటారు. అలా ప్రతి ప్రోమో కింద కామెంట్స్ కూడా పెడుతుంటారు. సరే ఇదంతా పక్కనబెడితే.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది, రష్మీపై చాలా చీప్ కామెంట్స్ చేశాడు!
వాలంటైన్స్ డే సందర్భంగా ‘చెప్పు బుజ్జికన్నా’ పేరుతో ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా స్టేజీపై వచ్చిన రష్మీని.. ‘ఫిబ్రవరి 14 కదా.. ఒక్కళ్లకు గట్టిగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను’ అని చెప్పింది. దీనికి రెస్పాండ్ అయిన ఆది.. ‘నాకు ఇచ్చేయండి నేనెళ్లి అతడికి ఇచ్చేస్తాను’ అని సుధీర్ గురించి పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ‘ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా?.. బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు గానీ ఏదో ఓ రోజు సడన్ గా బాబుని ఇవ్వడాలు ఇలాంటి చేయకండి’ అని రష్మీపై సెటైర్ వేశాడు. కామెడీగా అన్నప్పటికీ.. ఆది మాటలకు రష్మీ ముఖం చిన్నబుచ్చుకున్నట్లు కనిపించింది. ఇక సుధీర్ ఫ్యాన్స్ అయితే ఆదిపై మండిపడుతున్నారు. ‘బీ గ్రేడ్ సెటైర్స్ లాంటి ఆ మాటలేంటి?’ అని మండిపడుతున్నారు. ఏదేమైనా సరే కామెడీ పేరు చెప్పుకుని ఇలా అనడం కరెక్ట్ కాదంటున్నారు. మరి రష్మీపై హైపర్ ఆది చేసిన కామెంట్స్ పై మీరేం అంటారు. కింద మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.