రెండు తెలుగు రాష్ట్రాలని గత 15 సీజన్లుగా అలరిస్తోన్న ఏకైక డ్యాన్స్ షో ‘ఢీ’. మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటకి వెలికి తీసి.. వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో మల్లెమాల యాజమాన్యం ఎప్పుడూ ముందుంటోంది అనడంలో సందేహం లేదు. ఇక 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఢీ డ్యాన్స్ షో.. 15 వ సీజన్ లో కూడా దుమ్మురేపుతోంది. ”ఢీ-15 ఛాంపియన్ బ్యాటిల్” పేరుతో ప్రస్తుత సీజన్ అలరిస్తోంది. ఇక ఈ షోకు గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లతో పాటుగా అందాల ముద్దుగుమ్మ శ్రద్దాదాస్ కూడా జడ్జిగా వ్యవహరించడం మనకు తెలిసిందే. ఇక ఫిబ్రవరి 1వ తారిఖుకు సంబంధించిన ఎపిసొడ్ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఎపిసొడ్ లో కొరియోగ్రాఫర్ కన్నా పై సీరియస్ అయ్యాడు శేఖర్ మాస్టర్.
‘ఢీ’ డ్యాన్సింగ్ ఐకాన్.. గత 14 సీజన్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డ్యాన్స్ అభిమానులను అలరిస్తూనే ఉంది. 14 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని 15వ సీజన్ లోకి అడుగుపెట్టింది ఈ డ్యాన్స్ షో. ఇక ఈ షోకి స్టార్ యాంకర్ ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు. ఢీ15 ఛాంపియన్ బ్యాటిల్ పేరుతో ప్రసారం అవుతున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఇక షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కన్నా పై సీరియస్ అయ్యాడు. చైతన్య మాస్టర్ కంటెస్టెంట్స్ ప్రభాస్ పాటకు చంద్రముఖి స్టైల్లో డ్యాన్స్ ఇరగదీశారు. అయితే ఈ డ్యాన్స్ లో మ్యాజిక్ లేదని కన్నా అన్నాడు. దాంతో కొరియోగ్రాఫర్ కు వేలు చూపిస్తూ.. మ్యాజిక్ అంటే ఏంటి? గాల్లో డ్యాన్స్ లు చెయ్యాలా? అంటూ సీరియస్ అయ్యాడు శేఖర్ మాస్టర్. నువ్వు చేసిన స్టెప్పులు ఎవ్వరు వెయ్యలేదా? అని సీరియస్ వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కన్నాపై సీరియస్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.