సాధారణంగా సెలబ్రిటీలపై అభిమానులకు క్రష్ ఉండటం మామూలు విషయమే. అయితే సెలబ్రిటీలకు సెలబ్రిటీలపై క్రష్ ఉండటం కాస్త ఆసక్తికరమైన విషయం. ఇక సదరు వ్యక్తిపై ఉన్న ప్రేమను సినిమా ఫంక్షన్స్ లోనో లేదా ఇంటర్వ్యూల్లోనో, పలు షోల ద్వారానో మనసులో ఉన్న ప్రేమను బయటపెడుతుంటారు. తాజాగా యాంకర్ ప్రదీప్ పై తనకున్న క్రష్ ను బయటపెట్టారు హాట్ బ్యూటీ శ్రద్దా దాస్. అదీకాక ఈ క్రష్ భవిష్యత్ లో ఎలా మారుతుందో చూడాలని ఆడియన్స్ లో ఆలోచనలో పడేసింది ఈ ముద్దుగుమ్మ. ఢీ 15 స్టేజీపై ప్రదీప్ తో కలిసి స్టెప్పులేసి అలరించింది.
యాంకర్ ప్రదీప్.. బుల్లితెర సూపర్ స్టార్ గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఈ ఎనర్జింటిక్ యాంకర్. ప్రస్తుతం పలు షోలకు తనదైన యాంకరింగ్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఇక ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ షోకు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. తన చలాకీ మాటలతో పంచులేసే ఆదికే కౌంటర్లు వేస్తుంటాడు ప్రదీప్. ఇక ఢీ 15 కు జడ్జీలుగా శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, శ్రద్దా దాస్ లు వ్యవహరిస్తున్న సంగతి విదితమే. ఇక ఈ షో కు సంబంధించిన తాజా ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో ఎప్పటి లాగే ఆది తన పంచులతో రెచ్చిపోగా.. డ్యాన్సర్స్ కలర్స్ థీమ్ లో భాగంగా తమ అద్భుత ప్రదర్శన చూపించారు.
అయితే ఈ ప్రోమోకి ప్రత్యేక ఆకర్షణ ఏదైనా ఉంది అంటే.. అది యాంకర్ ప్రదీప్-శ్రద్దా దాస్ ల డ్యాన్స్ కమ్ క్రష్ గురించి చెప్పడమే. యాంకర్ ప్రదీప్ కు తనకు గతంలో చిన్న క్రష్ ఉందని ఈ సందర్భంగా శ్రద్దా తెలిపింది. అయితే ఈ క్రష్ భవిష్యత్ లో ఎంతదూరం వెళ్తుందో మాత్రం చెప్పలేనని బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ. దాంతో మీరిద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలని శేఖర్ మాస్టర్ నవ్వులు పూయించాడు. అనంతరం ప్రదీప్-శ్రద్దాలు కలిసి స్టేజీపై రొమాంటిక్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక శ్రద్దా తన హాట్ హాట్ అందాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. మరి ప్రదీప్ పై మనసు పారేసుకున్న శ్రద్దా దాస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.