ప్రస్తుతం నడుస్తోంది సోషల్ మీడియా యుగం. ఒక్కసారి ఇక్కడ ఫేమస్ అయితే.. వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. ఇందుకే స్టార్ హీరోయిన్స్ సైతం సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు. ఈ విషయంలో బుల్లితెర బ్యూటీలు అయితే తెగ హడావుడి చేస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు కూడా వచ్చి చేరింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. తన హాట్ పిక్స్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది ఈ భామ. మరోసారి తన సోకుల విందు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఫిక్స్ నెటింట్లో వైరల్ అవుతోన్నాయి.
సోషల్ మీడియాలో సాధారణ యాంకర్‌గా స్రవంతి చొక్కారపు తన కెరీర్ స్టార్ట్ చేసింది. అయితే ‘పుష్ప’ సినిమా ఇంటర్వ్యూతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో రాయలసీమ యాసలో మాట్లాడి అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లో అవకాశం వచ్చింది. దీంతో అక్కడ కూడా తన యాటీట్యూడ్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్‌తో కావాల్సినంత పాపులారిటీని దక్కించుకుంది ఈ బ్యూటీ. అంతేకాదు స్రవంతికి బిగ్ బాస్ షో వల్ల సినిమాల్లోను అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు తగినట్లే చక్కని రూపం, చలాకీ మాటలతో అందరిని అలరిస్తోంది. రియాలిటీ షో, ఇంటర్వ్యూలలో ట్రెడిషనల్ వేర్ లో ఎక్కువగా కనిపించే స్రవంతి.. నెటింట్లో మాత్రం అందాల విందు చేస్తుంది. ఇక ఈ అమ్మడు షూటింగ్ లతో బిజిగా ఉంటూనే.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానలతో షేర్ చేసుకుంటుంది. స్రవంతి చొక్కారపు క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో వేడిపుట్టిస్తోంది. తాజాగా స్రవంతి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. తన భర్తతో కలిసి పార్క్ హాయత్ హోటల్లో డేట్ నైట్ కు వచ్చానని తెలిపింది. అంతేకాదు కొన్ని హాట్ ఫోటోలను కూడా పంచుకుంది. ఈ అమ్మడు ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఈ ఫిక్స్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. పాపులారిటీ కోసం ఆ మాత్రం అందాల ఆరబోత తప్పేందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇక స్రవంతి గతంలో బీచ్‌లో బ్లాక్ కలర్ బికినీలో అందాలు ఆరబోసింది.