ఆస్కార్ అవార్డు అంటేనే నటీనటులు చాలా గౌరవంగా చూస్తారు. అలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డు నామినేషన్స్ కి ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంపికవుతుందని చాలామంది భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ గుజరాతీ మూవీ ‘చెల్లో షో’ ఎంపికైంది. ఆస్కార్ కి నామినేట్ అయ్యేంతగా ఏముందా ఈ సినిమాలో అని ప్రేక్షకులు ఆలోచించారు. ఈ చిత్రం ఓటీటీల్లో అందుబాటులో లేకపోయినప్పటికీ, ఎలా వీలైతే అలా చూసేశారు. మెయిన్ గా ఆరుగురు పిల్లల యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆ చిన్నారుల్లోనే ఓ అబ్బాయి, క్యాన్సర్ తో మరణించడంతో షాకయ్యారు. ఆ అబ్బాయి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు.
The #ChhelloShow child actor, Rahul Koli, dies of cancer just a few days before the film’s theatrical release. RIP 💐#RahulKoli #RIP pic.twitter.com/TnBx6A4jEH
— $@M (@SAMTHEBESTEST_) October 11, 2022
ఇక వివరాల్లోకి వెళ్తే.. గుజరాతీ భాషలో డైరెక్టర్ పాన్ నలిన్ తీసిన సినిమా ‘చెల్లో షో’. ఇందులో నటించిన ఆరుగురు పిల్లల్లో రాహుల్ కోలి(15) ఒకడు. గత కొన్నాళ్లుగా లుకేమియా క్యాన్సర్ తో పోరాడుతున్న అతడు తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని రాహుల్ తండ్రి ధ్రువీకరించారు. ‘ఆదివారం (అక్టోబరు 2) ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత కొంతసేపటికే జ్వరం వచ్చినట్లు అనిపించింది. రాహుల్ మూడుసార్లు రక్తవాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు’ అని శోకంతో రాము కోలి చెప్పారు. అయితే తన కొడుకు నటించిన చివరి చిత్రం ‘చెల్లో షో’ని అక్టోబరు 14న చూస్తామని, ఆ తర్వాతే అంత్యక్రియలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత తమ జీవితాలు మారతాయని రాహుల్ తమతో చెప్పేవాడు, ఆరోజు చూడకుండానే వెళ్లిపోయాడని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇక ‘చెల్లో షో’ మూవీ విషయానికొస్తే.. గుజరాత్ లోని చలాలా అనే పల్లెటూరిలో సమయ్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు ఉంటాడు. అతడికి ఒకానొక సమయంలో సినిమాపై ఎంతో ప్రేమ ఏర్పడుతుంది. ఆ తర్వాత సినిమా, థియేటర్ తన ప్రాణం అనేంతలా మారతాడు. ఇక సినిమా అనేది అతడి జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. చివరకు ఏమైందనేది ఇ సినిమా. ఈ సినిమా ‘ద లాస్ట్ షో’ పేరుతో దేశవ్యాప్తంగా అక్టోబరు 14న థియేటర్లలో విడుదల కానుంది. అంతకు ముందు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన ఈ సినిమా… ప్రేక్షకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.