సెలబ్రిటీలు అన్నాక వారు ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ సందడి కనిపించడం మామూలే. కొన్నిసార్లు షోలలో, అవార్డుల ఫంక్షన్స్ లో ఏదొక విధంగా హీరోయిన్స్ ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తుంటాం. కొత్త స్టైల్ కదా అని కొందరు హీరోయిన్స్ అందాలన్నీ ఆరబోస్తూ కురచ దుస్తులు ధరిస్తుంటారు. మరికొందరు ధరించాల్సిన దానికంటే హెవీ డ్రెస్ ధరించి.. వెనకాల వేరొకరు ఆ డ్రెస్ ని పట్టుకొని తీసుకెళ్లే విధంగా రెడీ అవుతుంటారు. ఇంకొందరు డ్రెస్ వలన ఇబ్బందులు పడుతూ.. ఆ డ్రెస్సును సర్దుకోవడానికే సమయం సరిపోతుంది. ఇలాంటి సంఘటనలన్నీ మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.
ఈ క్రమంలో.. అవార్డు ఫంక్షన్, పబ్లిక్ మీటింగ్ కి వెళ్లకుండానే ఓ హీరోయిన్ తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఇబ్బంది పడుతూ మొబైల్ ఫోన్ పారేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇంతకీ డ్రెస్సుతో అంతలా ఇబ్బందులు పడుతూ మొబైల్ పారేసుకున్న హీరోయిన్ ఎవరంటే.. ప్రణీత. తెలుగులో అత్తారింటికి దారేది సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ బెంగుళూరు బ్యూటీ.. బావ, రభస, హలో గురు ప్రేమకోసమే, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. కానీ.. స్టార్ హీరోయిన్స్ జాబితాలో మాత్రం చేరలేకపోయింది. ఇక ఇటీవల అమ్మడు పింక్ కలర్ లో హెవీ డ్రెస్ ధరించి క్రేజీ వీడియోతో వార్తల్లో నిలిచింది.
సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోయర్స్ ని కలిగిన ప్రణీత.. కారులో నుండి దిగుతూ తన ఖరీదైన మొబైల్ ని కింద పారేసుకుంది. కారులో ఉన్నంతసేపు మొబైల్ ని ఒళ్ళో పెట్టుకొని కూర్చున్న ప్రణీత.. కారు దిగేటప్పుడు చేతిలోకి తీసుకోవడం మర్చిపోయి అలాగే కారు దిగేసింది. దీంతో ఆమె డ్రెస్ లో ఉన్న మొబైల్ ఒక్కసారిగా నేలపై పడిపోయింది. అలా సోకులకు పోయి సొమ్మసిల్లి పడిపోయిందన్నట్లు.. మురిపెంగా వేసుకున్న డ్రెస్ ఆమె కొంపే ముంచిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని స్వయంగా ప్రణీతే షేర్ చేయడం విశేషం. మీరు కూడా వీడియోపై ఓ లుక్కేసేయండి.