బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లకు మోస్ట్ వాంటెడ్ క్రష్‌గా మారిన నటుడు విజయ్ దేవరకొండ. ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ హ్యాండ్సమ్.. తన టాలెంట్ నిరూపించుకున్నాడు.అయితే అతడి నుండి వారసత్వాన్ని తీసుకుని వచ్చాడు తమ్ముడు ఆనంద్ దేవరకొండ.
బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లకు మోస్ట్ వాంటెడ్ క్రష్‌గా మారిన నటుడు విజయ్ దేవరకొండ. గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి.. చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ హ్యాండ్సమ్.. తన టాలెంట్ నిరూపించుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. అమ్మాయిలకే కలల రాకుమారుడిగా మారడమే కాదూ.. హీరోయిన్స్ దృష్టిలో హల్క్‌గా అవతరించాడు. డిజాస్టర్లు పలకరిస్తున్న ఇతడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీగా మారిపోయాడు. అయితే అతడి నుండి వారసత్వాన్ని తీసుకుని వచ్చాడు తమ్ముడు ఆనంద్ దేవరకొండ. చేసినవి రెండు మూడు సినిమాలైనా మంచి పేరు తెచ్చుకున్నాడు. క్యాచీగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు.
దొరసానితో కథానాయకుడిగా మారాడు ఆనంద్. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకున్నా.. మిడిల్ క్లాస్ మెలోడీస్‌తో మెప్పించాడు. పుష్పక విమానంలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో మెరిశాడు. ఇప్పుడు బేబీ అంటూ పలకరిస్తున్నాడు. ఇందులో యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్యతో కలిసి రొమాన్స్ చేశాడు. మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్‌తో కలిసి సాఫ్ట్ వేర్ డెవలపర్లో నటించింది. దీనితో ఆమెకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. అలాగే అడపా దడపా సినిమాల్లో కూడా కనిపించింది. అలా వైకుంఠపురం, టక్ జగదీష్, వాలిమై వంటి చిత్రాల్లో కనిపించింది. ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు చాలా ఫేమస్ అయ్యాయి.
అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సుమ అడ్డాకు వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో ఆడుకుంటూ.. ఆటలాడించింది యాంకర్ సుమ. అయితే ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా.. ఆనంద్ దేవరకొండ, చైతన్యకు షోలో ప్రపోజ్ చేశాడు. చాలా అందంగా, క్యూట్ ప్రపోజల్ ఆమె ముందుంచాడు. వారిద్దరితో బొమ్మరిల్లు స్పూఫ్ చేయించింది సుమ. ఆ సందర్భంగా ఒక సారి తల గుద్దుకుంటే కొమ్ములొస్తాయి..కొమ్ములొస్తే.. నా మొహం బాగోదని వైష్ణవి అనగానే.. ఆనంద్ వచ్చి ఆమె తలను ఢీ కొట్టి, చాలా అని అడుగుతాడు. ఆమె చూసేసరికి ఇంకో సారా అంటూ దగ్గరకు వెళ్లి.. మళ్లీ తలను ఢీకొని ఐలవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. దీంతో వైష్ణవి కూడా మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.