సదా.. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని హీరోయిన్. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మ. జయం సూపర్ సక్సెస్ కావడంతో.. సదా కెరీర్ లో అవకాశాల కోసం వెతుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కనీసం ఓ పదేళ్ల పాటు అగ్ర తారగా వెలుగొందింది. ఇదే సమయంలో మిగతా భాషల్లో కూడా తన సత్తా చాటింది. ఇలా కెరీర్ లో పీక్స్ లో ఉండగానే సదా డౌన్ ఫాల్ మొదలయ్యింది. కారణాలు ఏవో తెలియవు గాని.., ఈ అమ్మడికి చిన్న హీరోలు సరసన కూడా అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ బుల్లితెరపై ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోలలో మెరుస్తూ.., ప్రేక్షకులకి టచ్ లో ఉంటోంది. తాజాగా సదా ప్రముఖ ఛానెల్ లో ప్రసరమయ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి అతిధిగా విచ్చేసింది. అయితే.., ఈ ఎపిసోడ్ ప్రోమోలో సదా కన్నీరు పెట్టడం అందరికీ షాక్ కలిగిస్తోంది.
అలీతో సరదాగా కార్యక్రమంలో భావోద్వేగాలకే పెద్ద పీఠ వేస్తుంటారు. సరదాగా మాట్లాడుతూనే అలీ.. అవతల వారి గుండె లోతుల్లో ఉన్న బాధని బయటకి తీస్తాడు. సదా ఎపిసోడ్ ప్రోమోలో కూడా ఇదే జరిగింది. “ఒక్క సినిమాతో స్టార్ అయిపోయావు. కెరీర్ లో పీక్స్ చూశావు. అంతా బాగుండగానే ఎందుకు నువ్వు స్లో అయిపోయావు? సదాకి ఎందుకు అవకాశాలు రాలేదని” అలీ ఓ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానం చెప్తూ.. సదా బోరున ఏడ్చేసింది. ఆమె చెప్పిన మాటలను ప్రోమోలో రివీల్ చేయలేదు గాని.., హీరోయిన్ గా సదా కెరీర్ ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని ఆమె కన్నీరు చూసిన వారికి అర్ధం అవుతోంది. ఇక ఇదే ప్రోమోలో సదా పలువురి హీరోల పై తన అభిప్రాయాన్ని చెప్పింది. బాలకృష్ణది చిన్న పిల్లాడి మనస్తత్వం అని.., జూనియర్ యన్టీఆర్ లాంటి డ్యాన్సర్ ని తాను ఇప్పటి వరకు చూడలేదని సదా కామెంట్స్ చేయడం విశేషం. మరి హీరోయిన్ గా సదా కెరీర్ అర్ధాంతరంగా ఎందుకు ముగిసిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ ప్లే అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.