తారల జీవితాల్లోని విశేషాలను తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉంటుంది. వారు ఒకప్పుడు ఎలా ఉండేవారు, వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందుకే సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు లాంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఒక హీరోయిన్ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సినీ సెలబ్రిటీలకు సాధారణంగానే మంచి రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులోనూ కష్టపడి పైకి వచ్చిన వారిని ఫాలో అయ్యే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. సొంత ప్రతిభ, స్వీయ కృషిని నమ్ముకొని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయినవారు ఎందరో ఉన్నారు. హీరోలే కాదు ఈ లిస్టులో హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి ఒక హీరోయిన్‌కు సంబంధించిన చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరోయిన్.. ఒక టైమ్‌లో ఇండస్ట్రీని షేక్ చేసింది. తన అందం, అభినయంతో అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిందామె. ఒకే ఒక్క డైలాగ్‌తో ఆమె సూపర్ హిట్ కొట్టింది. ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరనేది మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. సదా. ‘జయం’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది సదా. ఆ చిత్రంలో డైరెక్టర్ తేజ ఆమె పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు.
‘జయం’ మూవీలో ‘వెళ్లవయ్యా.. వెళ్లూ..’ అనే ఒక్క డైలాగ్‌తో సదా బాగా ఫేమస్ అయిపోయింది. ‘రాను రాను అంటోందే చిన్నదో’ పాట కూడా ఆమెకు మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. ‘జయం’తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన సదా.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకొంది. అయితే ఆమెకు ఏదీ కలసి రాలేదు. ఫస్ట్ మూవీ తర్వాత నటించిన ‘నాగ’, ‘దొంగ దొంగది’, ‘లీలా మహల్ సెంటర్’, ‘ఔనన్నా కాదన్నా’, ‘చుక్కల్లో చంద్రుడు’ చిత్రాలు నిరాశపర్చాయి. ఈ మూవీస్ మధ్యలో ‘అపరిచితుడు’ ఒక్కటే ఆమెకు మంచి హిట్‌ను అందించింది. అనంతరం పలు సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. దీంతో ఆమె డ్యాన్స్ షోల వైపు మళ్లారు. ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘ఢీ’ షోలో ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాంటి సదాకు సంబంధించిన చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. చిన్నారి సదాను ఆమె తల్లి ఎత్తుకోవడాన్ని ఇందులో చూడొచ్చు.