బుల్లితెర ప్రేక్షకులను నాన్ స్టాప్ అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో 'బిగ్ బాస్ జోడి' ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ డ్యాన్స్ రియాలిటీ షో.. ఎట్టకేలకు ఫినాలేకి దగ్గర పడింది. తెలుగులో బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పటిదాకా బిగ్ బాస్ లో జరిగిన ఆరు సీజన్లను ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు. కాగా.. అదే బిగ్ బాస్ షోలో సీజన్లవారీగా పాల్గొన్న కంటెస్టెంట్స్.. జోడిగా మారి ఇప్పుడు బిగ్ బాస్ జోడి డ్యాన్స్ షోలో పాల్గొన్నారు.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను నాన్ స్టాప్ అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘బిగ్ బాస్ జోడి‘ ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ డ్యాన్స్ రియాలిటీ షో.. ఎట్టకేలకు ఫినాలేకి దగ్గర పడింది. తెలుగులో బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పటిదాకా బిగ్ బాస్ లో జరిగిన ఆరు సీజన్లను ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు. ఇకపోతే బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్నవారంతా సెలబ్రిటీ హోదా సంపాదించుకుని కెరీర్ లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. అదే బిగ్ బాస్ షోలో సీజన్లవారీగా పాల్గొన్న కంటెస్టెంట్స్.. జోడిగా మారి ఇప్పుడు బిగ్ బాస్ జోడి డ్యాన్స్ షోలో పాల్గొన్నారు.
సీనియర్ నటి రాధా, హీరోయిన్ సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షో.. మొత్తానికి ఫినాలేకి చేరుకుంది. మార్చి 25, 26 తేదీలలో జరగనున్న బిబి జోడి ఫినాలేకి సంబంధించి కొత్తగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ఫినాలేతో బిబి జోడి ముగియనుండగా.. శేఖర్ మాస్టర్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. వచ్చీ రావడంతో ఫుల్ ఎనర్జిటిక్ డ్యాన్స్ పెరఫార్మన్స్ లతో ఆకట్టుకున్న శేఖర్ మాస్టర్.. చాలా గ్యాప్ తర్వాత సదాతో కలిసి స్టేజ్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరూ గతంలో ఢీ షోకి చాలా సీజన్స్ కి జడ్జిలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మళ్లీ స్టేజ్ పై కనిపించేసరికి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రోమోలో మెహబూబ్ – శ్రీసత్య పెర్ఫార్మన్స్ తర్వాత.. సదా మాట్లాడుతూ ‘ఇకపై నీ సిక్స్ ప్యాక్ ని మిస్ అయిపోతాం మెహబూబ్’ అని చెప్పింది. సదా కామెంట్ పై వెంటనే రియాక్ట్ అయిన శేఖర్ మాస్టర్.. ‘మిస్ అవ్వడం ఏముంది.. మీకు చూడాలని అనిపించినప్పుడల్లా మెహబూబ్ కి వీడియో కాల్ చేసి చూడండి’ అని సెటైర్ వేశాడు. దీంతో ఒక్కసారిగా సదా సిగ్గుపడుతూ మొహం చాటేసింది. ప్రస్తుతం ప్రోమోలో సదా – శేఖర్ మాస్టర్ ల కాంబినేషన్ హైలైట్ అవుతోంది. మరి మీరు కూడా సదా, శేఖర్ మాస్టర్ ల సరదా సన్నివేశాలు చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.