బుల్లితెర ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో వినూత్నమైన వినోదాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నారు నిర్వాహకులు. తెలుగులో బాగా ఆదరణ పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కంటెస్టెంట్స్ గా పాల్గొన్న సెలబ్రిటీలు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రతి సీజన్ లో కొంతమంది షోలో పాల్గొని.. మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చి.. బిగ్ బాస్ జోడి అని మరో కొత్త డాన్స్ ప్రోగ్రామ్ ప్రారంభించారు స్టార్ మా నిర్వాహకులు. కొన్ని వారాల నుండి రన్ అవుతున్న ఈ షోలో.. రోజురోజుకూ జంటలుగా పాల్గొన్న కంటెస్టెంట్స్ మధ్య వార్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వచ్చే శని, ఆదివారాలలో ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో నటి సదా, సీనియర్ నటి రాధా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రోమో అంతా సరదాగా కలర్ ఫుల్ పెర్ఫార్మన్స్ లతో సాగింది. ప్రోమోల సంగతి తెలిసిందేగా.. ముందు సరదాగా ఉన్నట్లే ఉండి.. మున్ముందు కాంట్రవర్సీ చూపిస్తుంది. ఈసారి సొంత పెర్ఫార్మన్స్ ల కోసం కాకుండా పక్కవాళ్ళ పెర్ఫార్మన్స్ లపై వాదించుకొని హర్ట్ అయిపోయారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలో మెహబూబ్ – శ్రీ సత్య పెర్ఫార్మన్స్ గురించి అరియానా, భానుశ్రీల మధ్య వార్ జరిగింది.
మెహబూబ్ – శ్రీ సత్య ఇద్దరూ డైరెక్టర్ త్రివిక్రమ్ స్పెషల్ అంటూ రోబోటిక్ పెర్ఫార్మన్స్ చేశారు. సో.. దీనిపై రియాక్ట్ అయ్యింది అరియానా.. త్రివిక్రమ్ అని రోబో చేశారు అంది. భానుశ్రీ అవును రోబోలాగే అనిపించింది అంది. వెంటనే సదా రియాక్ట్ అవుతూ.. త్రివిక్రమ్ అంటే మీరేం ఎక్సపెక్ట్ చేశారు? అని అడిగింది. దీనిపై మెహబూబ్ కూడా కామెంట్ చేశాడు. అంతే.. ఒక్కసారిగా భానుశ్రీ ఏడవడం మొదలు పెట్టేసింది. ఎందుకు ఏడ్చిందో తెలియదు కానీ.. వీడియో మాత్రం వైరల్ గా మారింది. ఎందుకో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. మరి బిబి జోడి ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాలను.. కంటెస్టెంట్స్ లో ఏ జంట మీ ఫేవరేట్ కామెంట్స్ లో తెలపండి.