డైరెక్టర్ తేజ అంటే దాదాపు అందరికీ తెలుసు. స్టార్ హీరోల జోలికి వెళ్లకుండా ఒక మంచి కథతో కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడనే పేరుంది. . అంతేకాదు వారితో సినిమాలు తీసి సక్సెస్ కొట్టడం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. ప్రస్తుతం రామ బాణం ప్రమోషన్స్ లో భాగంగా గోపి చంద్ తో కలిసి ఈ సినిమా గురించి తన మనసులో మాటలు పంచుకున్నాడు.
హీరో గోపి చంద్ నటించిన కొత్త చిత్రం రామ బాణం. లౌక్యం ఫేమ్ శ్రీవాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్. వచ్చే నెల 5 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా కాలంగా గోపీచంద్ కి సరైన హిట్ లేని సంగతి తెలిసిందే. దీంతో గతంలో తనకు బంపర్ హిట్ ఇచ్చిన శ్రీవాస్ తో మరోసారి చేతులు కలిపాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజ గోపీచంద్ తో ఇంటర్వ్యూలో కనిపించి సైర్ప్రైజ్ చేసాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా హీరో ప్రభాస్ గురించి టాక్ రావడం విశేషం. తేజ ప్రభాస్ ని పొగుడుతూ ఆకాశానికెత్తేశాడు.
డైరెక్టర్ తేజ అంటే దాదాపు అందరికీ తెలుసు. స్టార్ హీరోల జోలికి వెళ్లకుండా ఒక మంచి కథతో కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడు. అంతేకాదు వారితో సినిమాలు తీసి సక్సెస్ కొట్టడం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. ప్రస్తుతం రామ బాణం ప్రమోషన్స్ లో భాగంగా గోపి చంద్ తో కలిసి ఈ సినిమా గురించి తన మనసులో మాటలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ 1000 రెట్లు మంచి వాడని కితాబిచ్చాడు. గోపీచంద్ తండ్రి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తేజ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు. “మీ నాన్న గారు చాలా మంచి వారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ఎవరితో విబేధాలు లేవు. ప్రభాస్ ని అందరూ కామన్ గా ఇష్టపడతారు. అప్పుడు మీ నాన్న కృష్ణకి కూడా ఇంతే మంచి పేరుండేది. మీ నాన్న మీద ఎవరూ ఒక్క మాట కూడా పడనిచ్చేవారు కాదు. ఆ మంచితనమే ఇప్పుడు నీకు వచ్చింది” అని తెలియజేశాడు.
ఇక స్టార్ హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ అని అదేవిధంగా మంచి డైరెక్టర్ అంటే మీ నాన్న గారు టి.కృష గారు అని గోపీచంద్ తండ్రి మీద తనకున్న ఇష్టాన్ని తెలియజేశాడు. ఇక దాసరి నారాయణ గురించి కూడా మాట్లాడుతూ ఆయనొక సింహం లాంటివాడు. ఎవరికి కష్టం వచ్చినా వెళ్లి సహాయం చేసేవాడు. అని తేజ గోపీచంద్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. హీరో గోపీచంద్ ని జయం సినిమాతో ఇండస్ట్రీకి తీసుకు వచ్చింది తేజానే కావడం విశేషం. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు తేజ ఇంర్వ్యూ కూడా సినిమాకి ఏమైనా కలిసి వస్తుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.