జ్యోతిక.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య నటిగా, నిర్మాతగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో దక్షిణాది అన్ని భాషల్లో నటించిన జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రంలో జ్యోతిక నటన ఓ స్థాయిలో ఉందని మాత్రం చెప్పక తప్పదు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హింది వంటి భాషల్లో నటించి నటిగా మంచి ప్రదర్శనను కనబరిచింది.
ఇక జ్యోతిక నిర్మాతగా భర్త సూర్య నటించిన చిత్రం ఆకాశం నీ హద్దురా జాతియ అవార్డు కూడా అందుకోవడం విశేషం. ఇదిలా ఉంటే జ్యోతిక సినిమాల్లో రాణిస్తూనే భర్త సూర్యతో పాటు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే జ్యోతిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటారు. తన ఫ్యాన్స్ తో అప్పడప్పుడు టచ్ లో ఉంటూ వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేస్తుంటుంది. అయితే జ్యోతిక తాజాగా జిమ్ చేస్తున్న వీడియోను అప్ లోడ్ చేసింది. ఇక తక్కువ సమయంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతుంది.
జిమ్ లో జ్యోతిక హెవీ వర్కౌట్స్ చేస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఈ వయసులో కూడా జిమ్ లో ఇలాంటి వర్కౌట్స్ ఏంటి బాబోయ్ అంటూ ముక్కన వేలేసుకుంటున్నారు. ఇక జ్యోతిక ఈ వీడియోను పోస్టూ చేస్తూ.. నా పుట్టిన రోజుకు నా ఆరోగ్యాన్ని గిఫ్ట్ గా ఇస్తున్నాను. మా కోచ్ మహేష్ గారు నాకు ఫంక్షనల్ ట్రైయినింగ్ ఇస్తూ నన్ను ప్రొత్సహిస్తున్నారు. నా వయసు నన్ను మార్చకముందే.. నా వయసును నేను మారుస్తాను అంటూ జ్యోతిక రాసుకొచ్చింది. తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.