హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఆయన సినిమాలు ఎలా ఆడతాయో తెలుగులో కూడా ఆడతాయి. అంతే ఫాలోయింగ్ తెలుగులోనూ ఉంది.
చిత్ర పరిశ్రమలో నూటికి నూరు శాతం డెడికేషన్ ఉన్న అతికొద్ది మంది నటుల్లో సూర్య మొదటి వరుసలో ఉంటారు. సినిమా కోసం తన లుక్‌తో పాటు ఎంతటి కష్టానికైనా ఆయన ఓడుస్తారు. ముఖ్యంగా కొన్ని ప్రమాదకర పోరాట సన్నివేశాల్లో కూడా ఎలాంటి డూప్ లేకుండా నటిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలా సినిమాల షూటింగ్‌ల సమయంలో ఆయన గాయపడుతూ వస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకుడిగా.. 2009లో వచ్చిన ‘అధవన్’ (తెలుగులో ఘటికుడు) సినిమా షూటింగ్ సమయంలోనూ ఆయన ప్రమాదానికి గురయ్యారు. ప్రాణాలకు తెగించి ఓ సీన్‌లో నటించారు. గాయానికి గురై నాలుగు రోజుల పాటు ఇబ్బందిపడ్డారు.
ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్ మీడియాకు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఘటికుడు సినిమా క్లైమాక్స్ సీన్ షూటింగ్ జరుగుతోంది. ఆ సీన్‌లో హీరో ఓ ఇనుప రోప్ సహాయంతో గాల్లో ఉన్న విమానం దగ్గరకు వెళతాడు. ఆ సీన్‌ను డూప్ పెట్టి తీద్దాం అని నేను అన్నాను. అందుకు సూర్య ఒప్పుకోలేదు. తానే చేస్తానన్నాడు. రోప్ పట్టుకుని పైకి సర్రున వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతడి విమానం కింద ఉన్న గిల్స్‌కు తగలబోయింది. అయితే, సూర్య వెంటనే తలను పక్కకు తిప్పాడు. అతడి భుజం గ్రిల్‌ను బలంగా తగిలింది.
‘టంగ్’ అని ఓ పెద్ద శబ్ధం కూడా వచ్చింది. సూర్య తన తలను పక్కకు తిప్పకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. తల పగిలిపోయేది. మేమంతా చాలా భయపడ్డాము. ఆయన భుజం మొత్తం ఎర్రగా అయిపోయింది. దాదాపు ఐదు రోజుల పాటు ఐస్ పెడుతూనే ఉన్నాము. ఆయన ప్రాణాలకు తెగించి ఆ సీన్ చేశారు’’ అని పేర్కొన్నారు. కాగా, ఘటికుడు సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి, డూపు లేకుండా యాక్షన్ సీన్‌లో నటించిన హీరో సూర్య తెగువపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.