తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే హీరో సూర్యకు సంబంధించిన ఓ వార్త తమిళ సినిమా సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతోంది. సూర్య తన కుటుంబం నుంచి వేరుపడ్డారని..
ప్రముఖ తమిళ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. తమిళనాట ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో తెలుగులో కూడా ఆయనకు అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తన వైవిధ్యమైన నటన, పాత్రలతో ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు. కేవలం సినిమా పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ సూర్య ఓ మంచి మనిషన్న పేరుంది. ఆయన తన కుటుంబంతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులను చదివిస్తున్నారు. తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీలతో కలిసి ఈ మంచి పనులు చేస్తున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. సూర్య తన కుటుంబం నుంచి వేరుపడ్డారన్న వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
భార్య జ్యోతిక కారణంగా ఆయన తన తండ్రి, తమ్ముడితో విడిపోయారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రముఖ తమిళ సీనియర్ నటుడు బైల్వాన్ రంగనాథన్ కూడా ఈ మేరకు సంచలన కామెంట్లు చేశారు. చెన్నై సినిమా సర్కిల్లో నడుస్తున్న ప్రచారం ప్రకారం.. సూర్యకు ఆయన తండ్రి శివకుమార్‌కు సంబంధాలు సరిగా లేవు. సూర్య, జ్యోతికల ప్రేమను శివకుమార్ మొదట వ్యతిరేకించారు. తర్వాత కుమారుడి కోసం ఒప్పుకున్నారు. ప్రస్తుతం జ్యోతిక సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జ్యోతిక మళ్లీ సినిమాల్లో నటించడాన్ని శివకుమార్ స్వాగతించలేకపోతున్నారు. దీనివల్లే తండ్రీకొడుకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సూర్య తన ఫ్యామిలీ నుంచి వేరుపడాలని భావించారు.
ఇందుకోసం ముంబైలో ఇళ్లు తీసుకున్నారు. ప్రస్తుతం సూర్య, జ్యోతిక తన పిల్లలతో ముంబైలోని ఇంట్లోనే ఉంటున్నారు. ఇక, ఈ పుకార్లు ఏ మేరకు నిజం అన్నదానిపై స్పష్టత లేదు. సూర్య నిజంగానే కుటుంబానికి దూరంగా ముంబైలో స్థిరపడ్డారా? స్థిరపడితే ఎందువల్ల ఆయన అలా చేశారు? తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు అన్నది ఎంత వరకు నిజం? అన్నది తెలియాలంటే సూర్య నుంచి కానీ, సూర్య తండ్రి శివకుమార్ నుంచి కానీ, ఓ అధికారిక ప్రకటన రావాల్సిందే. వారు దీనిపై స్పందించాల్సిందే. మరి, సూర్య.. జ్యోతిక కారణంగా కుటుంబంనుంచి వేరుపడ్డారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.