ఓ స్టార్ హీరో ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ ఉండే గేటెట్ కమ్యూనిటీలో 9వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు.
సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేవి.. లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు, వెకేషన్స్. సెలబ్రిటీలు సైతం మన ఊహకు తగ్గట్లుగానే ఖరీదైన కార్లలో తిరుగుతూ.. విలాసవంతమైన హౌస్ లల్లో నివాసం ఉంటుంటారు. ఇక కొంత మంది ఇల్లు ఉన్నప్పటికీ తమ అభిరుచులకు తగ్గట్టు మరో ఇంటిని కూడా కొనుగోలు చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరో ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ ఉండే గేటెట్ కమ్యూనిటీలో 9వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు. దక్షిణాదికి చెందిన స్టార్ హీరో ముంబైలో ఫ్లాట్ కొనడంతో తన మకాం అక్కడు మారుస్తాడా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇంతకి ఆ లగ్జరీ హౌస్ కొన్న హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముంబైలో ఓ విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 70 కోట్లు పెట్టి సూర్య ఈ లగ్జరీ ఫ్లాట్ ను కొన్నాడట. రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఉండే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ ను తీసుకున్నాడు సూర్య. అత్యంత విలాసవంతమైన ఈ ఫ్లాట్ లో భారీ గార్డెన్ స్పేస్, పార్కింగ్ స్పాట్ లు కూడా ఉన్నాయి. ఇక ఈ ఫ్లాట్ అసలు ధర వచ్చి రూ. 68 కోట్లు కాగా.. మిగతా 2 కోట్లు ఫ్లాట్ బుకింగ్, ఇతర ఖర్చులకు చెల్లించినట్లు సమాచారం. త్వరలోనే చెన్నై నుంచి సూర్య-జ్యోతికలు ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘సూర్య 42’ విడుదలకు సిద్దంగా ఉంది. సిరుత్తై శివ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 10 బాషల్లో రిలీజ్ కానుంది. మరి కొన్ని రోజుల క్రితం కుటుంబంతో సూర్య విడిపోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తాజాగా ముంబైలో సూర్య ఇల్లు కొనడం చర్చనీయాంశంగా మారింది.