హీరోయిన్ జ్యోతిక ఆశ్చర్యపరిచింది. కర్రసాము విద్యతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేసింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగింది?
హీరోయిన్ అనగానే సినిమాల్లో పాటలు, లవ్ సీన్స్ లో కనిపించే భామ మాత్రమే అని మనకు ఓ అభిప్రాయం ఉండేది. గత కొన్నేళ్ల కాలంలో దాన్ని బ్రేక్ చేస్తూ చాలామంది హీరోయిన్లు ఫైట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. వాళ్ల యాక్టింగ్ చూసి అందరూ ఆహా ఓహో అంటున్నారు. అయితే యాక్టర్ అన్న తర్వాత కెరీర్ ప్రారంభ దశలోనే ఇవన్నీ నేర్చుకుంటారు. కానీ సినిమాల్లో ఆ తరహా పాత్రలు, అందుకుతగ్గ పరిస్థితులు ఉండవు కాబట్టి పెద్దగా వాటిని ప్రదర్శించే స్కోప్ ఉండదు. కానీ హీరోయిన్ జ్యోతిక మాత్రం కర్రసాముతో ప్రతి ఒక్కరినీ అవాక్కయ్యేలా చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నగ్మ చెల్లెలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన జ్యోతిక, హీరోయిన్ తెలుగు-తమిళంలో చాలానే సినిమాలు చేసింది. తనతోపాటు కలిసి నటించిన సూర్యని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాలు నటిస్తూ, నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉంది. సూర్యకే కాదు ఈమెకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉందండోయ్. అలాంటి ఈమె.. యాక్టింగ్ లోనే కాదు మిగతా విషయాల్లో తోపు అని నిరూపించుకుంటోంది. అందుకు సంబంధించిన ఓ వీడియోనే ఇప్పుడు వైరల్ అయింది.
సాధారణంగా ఏదైనా స్టంట్స్ లాంటివి హీరోలు చేస్తుంటారు. అది కూడా నిపుణుల పర్యవేక్షణలో చేస్తారు. కానీ జ్యోతిక మాత్రం ఏకంగా స్టేజీపైనే అది కూడా చీరతో కర్రసాము చేసింది. 2020లో JFW మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఇదంతా జరిగింది. తాజాగా మరోసారి ఈ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన తెలుగు-తమిళ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇద్దరు పిల్లల తల్లయినా సరే మంచి ఈజ్ తో కర్రసాము చేస్తోందని మెచ్చుకుంటున్నారు. మరి జ్యోతిక వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.