టాలీవుడ్ లో ‘ఆర్ఎక్స్100’ మూవీతో అడుగుపెట్టిన ఢిల్లీ బ్యూటీ పాయల్ రాజపుత్. డెబ్యూ మూవీతోనే టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పాయల్.. ఆ తర్వాత వరుసగా ప్లాప్ సినిమాలనే ఖాతాలో వేసుకుంది. కెరీర్ పరంగా ఇప్పటివరకూ దాదాపు 15 సినిమాలు చేసిన పాయల్ కి తెలుగులో ఆర్ఎక్స్100 మూవీనే పెద్ద హిట్. కొన్నేళ్లుగా ప్లాప్ సినిమాల నుండి బయటపడే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా ఆది సాయికుమార్ సరసన ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమా చేసింది.
ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటుంది పాయల్. ఇక ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు.. పాయల్ పై చేసిన సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాయల్ స్టైల్ కోసం జీన్స్ ప్యాంటు వేసుకొచ్చింది. ఆ ప్యాంటుకి చిరుగులు కనిపించడంతో.. “నీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పు.. ప్యాంటు కొనుక్కోడానికి నేను డబ్బులిస్తా” అని అన్నాడు సుధీర్. దీంతో పాయల్ నవ్వేసింది. ప్రస్తుతం సుధీర్ చేసిన ఫన్నీ కామెంట్స్ వీడియో ట్రెండ్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.