‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తూ రచ్చ లేపుతుంటుంది. పాయల్‌ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన అజయ్ భూపతి ‘మంగళవారం’ మూవీలోనూ అవకాశమిచ్చాడు.
సినిమా ఇండస్ట్రీలో లక్ అనేది ఎప్పుడు ఎలా కలిసొస్తుందో చెప్పలేం. ఒకసారి నేమ్, ఫేమ్ వచ్చాక వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. చిన్న పొరపాటు జరిగినా కెరీర్ డౌన్ అయిపోతుంది. పాయల్ రాజ్‌పుత్ పరిస్థితి ఇలాగే అయింది. ఐదేళ్ల క్రితం ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అమ్మడి అందాల ఆరబోతకి యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఎవరీ అమ్మాయి? అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఎంక్వైరీ చేశారు. దెబ్బకి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. తెలుగులో టాప్ హీరోయిన్‌ల లిస్టులో పేరు దక్కించుకుంటుంది అనుకున్నారు. కట్ చేస్తే ఊహించని విధంగా కనుమరుగైపోయింది. సినిమాలైతే చేస్తుంది కానీ పెద్దగా గుర్తింపు, సక్సెస్ మాత్రం రాలేదు.
‘వెంకీమామ’ తప్పించి తను యాక్ట్ చేసిన మూవీస్ ఏంటో కూడా జనాలకు పెద్దగా గుర్తు లేవు. ఫస్ట్ సినిమాతో వచ్చిన క్రేజ్‌ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయింది. అయితే ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత తెలుగు పరిశ్రమలో సెటిల్ అవుదామని హైదరాబాద్ మకాం మార్చిన పాయల్‌ని సినిమాల ఎంపిక విషయంలో కొంతమంది దర్శకులు మిస్ గైడ్ చేశారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. తప్పుదోవ పట్టించి, అప్పట్లో తనకున్న ఫేమ్‌ని వాడుకున్నారని, ప్రస్తుతం తన కెరీర్ గురించి కేర్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది.
అయితే తనకు తొలి అవకాశమిచ్చిన అజయ్ భూపతి ‘మంగళవారం’ అనే మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. పోస్టర్లతో మరోసారి అలరించింది పాయల్. అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తూ రచ్చ లేపుతుంటుంది. రీసెంట్‌గా బెడ్ మీద బోర్లా పడుకుని, డిఫరెంట్ ఫోజులతో పిక్స్ పోస్ట్ చేసింది. అవి చూసి కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. పాయల్ పాపకి ఇన్‌స్టాగ్రామ్‌లో 4.1 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.