సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి పెట్టింది పేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాటలు, ట్వీట్స్ మొదలుకొని సినిమాల వరకూ అన్ని వివాదాలకు దారితీసేవే. అయితే.. కెరీర్ ప్రారంభంలో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు రూపొందించిన వర్మ.. గత కొన్నేళ్లుగా తాను సెట్ చేసిన ట్రెండ్ కి విరుధ్ధంగా సినిమాలు తెరకెక్కిస్తూ వివాదాల్లో నిలుస్తున్నాడు. కానీ వర్మ ఎంత కాంట్రవర్సీ సినిమా తీసినా చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
ఈ క్రమంలో తాజాగా డేంజరస్ అనే మూవీని తెరకెక్కించాడు వర్మ. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అయితే.. వర్మ సినిమాలలో విషయం లేకపోవచ్చు. కానీ వర్మ ఆలోచనా విధానం.. లైఫ్ స్టైల్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. వర్మ లాజిక్స్ అర్థం చేసుకున్నవారు అతన్ని దేవుడిగా కూడా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. చనిపోదామని అనుకుంటున్న సమయంలో వర్మ ‘రాముయిజం’ ప్రోగ్రాం చూసి ఆగిపోయానని, ఆ ప్రోగ్రాం వల్లే తనకు బ్రతకాలనే నిర్ణయం తీసుకుని లైఫ్ చేంజ్ చేసుకున్నానని సర్ప్రైజ్ చేశాడు ఓ వీరాభిమాని. తన వల్ల ఓ అభిమాని బ్రతికాడని తెలిసి వర్మ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం వర్మకు, అభిమానికి మధ్య జరిగిన సంభాషణ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.