సెలబ్రిటీలకు సంబంధించిన రేర్ పిక్స్, త్రోబ్యాక్ ఫోటోస్ ఫ్యాన్స్, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు తెరమీద కనిపించి నటీనటులు ప్రస్తుతం ఎలా ఉన్నారనే ఇమేజెస్ అయితే బాగా ఆకట్టుకుంటుంటాయి.
సెలబ్రిటీలకు సంబంధించిన రేర్ పిక్స్, త్రోబ్యాక్ ఫోటోస్ ఫ్యాన్స్, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు తెరమీద కనిపించి నటీనటులు ప్రస్తుతం ఎలా ఉన్నారనే ఇమేజెస్ అయితే బాగా ఆకట్టుకుంటుంటాయి. అయితే ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ తను సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుగా నటించినప్పటి అరుదైన పిక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది. తన ట్వీట్లతో ఎప్పుడూ ఏదో క్రాంటవర్శీ క్రియేట్ చేసే దర్శకుడు వర్మ ఈ రేర్ పిక్ పోస్ట్ చేసి, పాజిటివ్‌గా కామెంట్ చేయడం విశేషం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. RGV ఫస్ట్ ఫిలిం ‘శివ’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది తెలిసిందే. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి, సినిమా తీసే విధానంలో సరికొత్త ఒరవడి తీసుకొచ్చారు వర్మ.
ఈ మూవీలో నాగార్జున వెనకాల పూరి జగన్నాథ్ బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుగా కనిపించారు. ఇప్పటిలానే గెడ్డంతో, టక్ చేసి, కాస్త సన్నగా ఉన్నారు పూరి. అప్పటి ఆ పిక్ షేర్ చేస్తూ.. ‘‘ఒక బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుగా ‘శివ’ సెట్స్‌లో సూపర్ స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అతని సక్సెస్ నిజంగా ఇన్స్పిరేషన్’ అంటూ కామెంట్ చేశారు ఆర్జీవి. ‘బద్రి’ తో దర్శకుడిగా మారిన పూరి.. టాలీవుడ్ సినిమా కథ, కథనాల్లో కొత్తదనాన్ని, ముఖ్యంగా హీరోని మాస్‌గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిలా చూపించడంలో, మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం ఇవ్వడంలో సత్తా చాటారు. ఆయన సినిమాలు, డైలాగులు, హీరోల క్యారెక్టర్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన పూరి అడపాదడపా తన చిత్రాల్లో తెరమీద మెరిశారు. ‘శివ’ తర్వాత నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ‘ఏమాయ చేసావె’ లో దర్శకుడిగా కనిపించారు. ‘బిజినెస్ మెన్’, ‘టెంపర్’, ‘ఇజం’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రొమాంటిక్’, ‘లైగర్’, ‘గాడ్ ఫాదర్’, ‘ఓరి దేవుడా’ వంటి సినిమాల్లో కనిపించి అలరించారు పూరి. ‘లైగర్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, తనకు చాలా కాలం తర్వాత సక్సెస్ ఇచ్చిన రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ బాంబేలో ప్రారంభమైంది.
A would be Super Smart director #PuriJagan on the sets of SHIVA as a background artiste ..His is a truly inspirational RISE ! pic.twitter.com/BPJ6rOfgf1
— Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2023