ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉంది. కానీ అది ఆగిపోయింది. అది ఏ సినిమానో తెలుసా?
వర్మ దర్శకుడిగా ట్రెండ్ సెట్టర్, నటుడిగా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్. ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఓ రేంజ్ లో ఉంటుంది అనుకునేవాళ్లు ఉంటారు. కానీ వర్మ ఎప్పుడూ పవన్ ని విమర్శిస్తూనే ఉంటారు. సినిమాల పరంగా, వ్యక్తిగతంగా పవన్ అంటే ఇష్టం అని చెప్పే వర్మ.. రాజకీయ పరంగా మాత్రం అయిష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇంతలా ఉండే వర్మ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి ఒక కథ చెప్పారన్న విషయం తెలుసా. అవును వర్మ పవన్ కళ్యాణ్ కి ఒక సినిమా కథ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఇండస్ట్రీకి రాని సమయంలో రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఒక మూసలో వెళ్తున్న సినిమా ఇండస్ట్రీకి సరికొత్త మూవీ ఫార్మాట్ ని పరిచయం చేశారు.
అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వర్మతో సినిమా అనగానే చేయను అనేశారు. పవన్ కళ్యాణ్ కూడా వర్మలానే ట్రెండ్ సెట్టర్. డిఫరెంట్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు. ఇండస్ట్రీకి రావడం రావడంతోనే ఏడు వరుస హిట్స్ ని అందుకున్నారు. ఇద్దరూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. అప్పుడు వర్మ చిరంజీవి ఇంటికి వెళ్లారు. నార్మల్ గానే చిరుని కలిసినట్టు వర్మ చెప్పారు. పవన్ గురించి చెబుతుంటే విన్నాను కానీ యాక్టర్ అవుతాడని అనుకోలేదని అన్నారు. అప్పుడు ‘వైఫ్ ఆఫ్ వరప్రసాద్’ అనే సినిమా చేస్తున్నానని.. ఆ సినిమాకి నిర్మాతగా ఉన్నానని.. హీరో పాత్ర కోసం పవన్ ని అడిగితే అలాంటి పాత్రలు చేయనని అన్నారని వర్మ వెల్లడించారు.
రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ డెన్ పేరుతో ఒక ఆఫీస్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ డెన్ ని పరిచయం చేస్తూ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కి వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమా కథ చెప్తే.. చేయను అని చెప్పినట్లు వర్మ వెల్లడించారు. జేడీ చక్రవర్తి, వినీత్ లు నటించిన ఈ సినిమా 1997లో విడుదలైంది. కామెడీ సినిమాలను డైరెక్ట్ చేసే వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అలా పవన్, వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా ఆగిపోయింది. అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేది? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
పవన్ కళ్యాణ్ కి నేను కథ చెప్తే, అలాంటి రోల్స్ నేను చేయను అన్నాడు : RGV #RGV #RgvDen #pawankalyan #JanaSena #NTVTelugu #NTVENT pic.twitter.com/lc8np6OxKe
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 19, 2023