సినిమాలు సాధారణంగా హిట్, ప్లాప్ అవుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ తట్టుకుని నిలబడగలగాలి. హిట్ అయిన వారు అందలమెక్కుతుంటే ప్లాప్ అయిన వారు మాత్రం క్రమంగా కనుమరుగవుతుంటారు.
సినీ రంగంలో దర్శకనిర్మాతలుగా నిలదొక్కుకోవాలంటే వాళ్లు తీసిన సినిమాలు హిట్ అవ్వాలి. లేదా అంతే సంగతులు. అలా అని అందరికీ విజయం దక్కదు. సక్సెస్ కొట్టినవాళ్లు టాప్ రేంజ్‌లో ఉంటే.. ఫ్లాప్ ఇచ్చిన వాళ్లు మాత్రం కనిపించకుండా సినీ పరిశ్రమకు దూరమవుతారు. అయితే.. బాలీవుడ్‌లో వరుసగా 25 ప్లాపులు ఇచ్చి, ఇంకా సినిమాలు తీస్తున్న ఫిల్మ్ మేకర్ ఉన్నారంటే నమ్మడానికి కొంచెం టైమ్ పట్టుద్ది. 24 ప్లాపులు ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను సైతం బీట్ చేసిన ఓ దర్శకుడు ఉన్నారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుందనడంలో సందేహం లేదు. 25 ప్లాపులు తర్వాత కూడా ఇంకా బాలీవుడ్‌లో సినిమాలు తీస్తున్న నిర్మాత, దర్శకుడు గురించి మీకు తెలుసా? ఇండియన్ సినీ పరిశ్రమలో కాంట్రవర్సిలకి కేరాఫ్ ఆడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి తెలియనివారుండరు. అయితే.. అత్యధిక ఫ్లాపులు తీసిన వారిలో రామ్ గోపాల్ వర్మ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానంలో దర్శకుడు ప్రియదర్శి 14 ప్లాపులు, సతీష్ కౌశిక్ 10 ప్లాపులతో కెరీర్ కొనసాగిస్తున్నారు. 25 ప్లాపులతో ముందు వరుసలో ఉన్నాడు.
దర్శకుడు ‘విక్రమ్ బట్’. 1914లో తొలిసారి మెగా ఫోన్ పట్టిన ఈ డైరెక్టర్ గత 29 సంవత్సరాల్లో 33 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అందులో 25 ప్లాపులు ఉండటం గమనార్హం. విక్రమ్ భట్ ‘మదోష్’ అనే సినిమాతో బాలీవుడ్ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈయన తీసిన చిత్రాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. 1998లో తీసిన ‘గులామ్’ సూపర్ హిట్ అయింది. అందులో హీరోగా అమీర్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్ద డైరెక్టర్ అవుతాడు అనుకున్నారట బాలీవుడ్ జనాలు. కానీ విక్రమ్ భట్ తీసిన సినిమాలన్ని డిజాస్టర్స్ కావడంతో తన కెరీర్ ముగుసిపోయినట్లయింది. అయినా పట్టు వదలకుండా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
విక్రమ్ భట్ తన 29 సంవత్సరాల సినీ కెరీర్‌లో 33 సినిమాలు తీస్తే అందులో మూడు హిట్ అవ్వాగా, మూడు యావరేజ్ కాగా, మరోకటి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మిగతవన్నీ డిజాస్టార్ లిస్ట్‌లో చేరిపోయాయి. ఆయన తీసిన సినిమాలు ఎక్కువగా హార్రర్, కామెడీలే కావడం విశేషం. అయితే.. విక్రమ్ భట్ రికార్డ్ స్థాయిలో ఫ్లాపులు ఇచ్చినప్పటికీ ఆయన ప్రయోగాలు చేయడం మాత్రం మానలేదు. ప్రతి సినిమాకు ఏదో ఒక ప్రయోగం చేస్తునే వెళ్లాడు. తన కెరీర్‌లో టెక్నాలజీ పరంగా అనేక సినిమాలు తీసి ప్రయోగాలు చేశాడు. కానీ అవేవి వర్కవుట్ కాక చేతులు కాల్చుకున్నాడు. మరి రానున్న రోజుల్లో అయిన హిట్ మూవీ తీస్తాడా? లేక కెరీర్‌ను ఫ్లాపులతో కొనసాగిస్తాడా? అనేది చూడాలి. ఏదేమైనా.. 25 సినిమాలు ఫ్లాపులు తీసిన కెరీర్‌ను ఇంకా కొనసాగిస్తున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే మరి.. ఈ డైరెక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.