SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » reviews » Naga Chaitanya Thank You Movie Review In Telugu

Thank You Movie Review: నాగచైతన్య థాంక్యూ మూవీ రివ్యూ..!

  • Written By: Dharani
  • Updated On - Fri - 22 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Thank You Movie Review: నాగచైతన్య థాంక్యూ మూవీ రివ్యూ..!

సినిమా పేరు : థాంక్యూ
నటీనటులు : నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాశ్ రాజ్
డైరెక్టర్ : విక్రమ్ కే కుమార్
నిర్మాతలు : రాజు, శిరీష్
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరామ్
రిలీజ్ డేట్ : 22 జులై 2022

‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటించారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌ చేయడంతో ‘థ్యాంక్యూ’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య నేడు(జులై 22) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల సినిమా రిలీజ్‌ అయ్యింది. మరి ‘థ్యాంక్యూ’ కథేంటి.. నాగ చైతన్య ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

సినిమాలలో వేరియేషన్స్ అనేవి ప్రతి సినిమాలో చూపిస్తూనే ఉన్నాడు నాగ చైతన్య. అలాగే తన కెరీర్ కి ఉపయోగపడే కథలు, క్యారెక్టర్ లతో పాటు తన ఫ్యాన్ బేస్ విస్తరించుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా థాంక్యూ అనే ఎమోషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే.. ఈ సినిమాలో చైతూ మూడు వేరియేషన్స్ లో కనిపిస్తాడు. నాగచైతన్య ఇదివరకు మూడు వేరియేషన్స్ ని ప్రేమమ్ సినిమాలో చూపించేసాడు. మరి మేకర్స్ ఇందులో ఏమైనా కొత్తదనం తీసుకొచ్చారేమో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

మన సక్సెస్ కు కారణమైన వాళ్లను అస్సలు మరిచిపోకూడదు.. అనేదే ఈ సినిమా కథాంశం. నారాయణపురం అనే చిన్న గ్రామానికి చెందిన అభిరామ్(నాగచైతన్య) నుండి పట్టుదలతో టాప్ మోస్ట్ బిలినియర్ అవుతాడు. అయితే.. తన కెరీర్ లో సక్సెస్ కి కారణం తానేనని, సొంతంగా ఎవరి సహాయం లేకుండా ఎదిగాను అనే ధీమాతో బతికేస్తుంటాడు. ఈ జర్నీలో అతనికి ప్రియా(రాశిఖన్నా) పరిచయం అవుతుంది. ఆ తర్వాత తన సక్సెస్ వెనుక చాలామంది వ్యక్తులు ఉన్నారని అభి రియలైజ్ అవుతాడు. అప్పటినుండి ఓ థాంక్యూ టూర్ స్టార్ట్ చేస్తాడు. మరి అభి తన కృతజ్ఞతా భావాన్ని ఎలా చూపిస్తాడు..? ఆ థాంక్యూ టూర్‌ ఎలా సాగింది? అనేదే తెరపై చూడాల్సిందే.

thank you

విశ్లేషణ:

నాగ చైతన్యకి లవ్ స్టోరీస్ కొత్త కాదు. అలాగని మాస్ కటౌట్ లేదని కాదు. కానీ.. ఈసారి కూడా తనకు మనం లాంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో క్లాస్ స్టోరీనే ఎంచుకున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య(అభిరామ్) సరసన రాశీఖన్నా(ప్రియా), అవికా గోర్(చిన్నూ), మాలవికా నాయర్(పారు) హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాలోకి వెళ్తే.. అభిరామ్, ప్రియా పాత్రలను పరిచయం చేస్తూ సినిమా కూల్ గా ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్‌ ని అందమైన ఎమోషన్స్, రొమాంటిక్ సీన్స్‌ తో నడిపించే ప్రయత్నం చేశారు. అక్కడక్కడా చిన్న ట్విస్ట్‌ల రూపంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు వస్తాయి.

ఇక ఫ్లాష్ బ్యాక్ లో పారు(మాళవిక నాయర్‌)తో వచ్చే సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. అభి, పారు క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలా ఫస్టాఫ్‌ లో అసలు కథ ఏంటనేది రివీల్ చేయకుండా.. ఆద్యంతం హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీని చూపిస్తూ సాగించారు. మంచి ఎమోషన్స్ ఉన్నప్పటికీ, ఇంటర్వెల్ ఎపిసోడ్ ట్రైలర్ లో విన్న డైలాగ్ కంటే కొత్తగా అనిపించకపోవడం గమనార్హం. కేవలం అభి తన జర్నీకి సహకరించిన వారికీ థాంక్యూ చెప్పాలని రియలైజ్ అవ్వడంతో ఇంటర్వెల్ ముగుస్తుంది.

thank you

ఇక సెకండాఫ్ లో హీరో ఎలా థాంక్యూ చెప్పాడు అనే అంశం చుట్టూనే కథ తిరుగుతుంది. అంటే.. సెకండాఫ్ లో హీరోనే ప్రధానము. కానీ.. అతని లక్ష్యాన్ని ఆల్రెడీ ఇంటర్వెల్ లోనే రివీల్ చేసినప్పటికీ, సెకండాఫ్ అంతా థాంక్యూ చెప్పడాన్నే లక్ష్యంగా పెట్టడమే ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించవచ్చు. ఎక్సపెక్ట్ చేసే స్థాయిలో సెకండాప్గ్ కథ పుంజుకోకపోవడం థ్యాంక్యూకి బిగ్ మైనస్ అని చెప్పవచ్చు. ఇక చిన్నూ పాత్రలో అవికా గోర్ సెకండ్ హాఫ్‌ లో ఎంట్రీ ఇస్తుంది. అవికా, చైతు మధ్య వచ్చే సీన్స్ కాస్త రిఫ్రెషింగ్‌ గా అనిపిస్తాయి. సినిమా అంతా ఆకట్టుకునే సన్నివేశాలు అక్కడక్కడా కనిపిస్తాయి. కానీ.. అంతకు మించి బలమైన కథను ఎక్సపెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యే అవకాశం లేకపోలేదు.

ఇక సినిమాలో మహేష్ బాబు రిఫరెన్స్ ఎక్కువగానే ఉంది. మధ్యలో మహేష్ బాబు ఫ్యాన్ గా సినిమా కటౌట్ కట్టిస్తాడు హీరో. అభిరామ్ పాత్ర‌లో నాగ చైత‌న్య చక్క‌ని నటన, వేరియేషన్స్ తో ఆకట్టుకున్నాడు. రాశీ ఖ‌న్నా, అవికా గోర్, మాళవిక నాయర్ తమ పాత్రల మేరకు బాగా చేశారు. ఇక ప్రకాష్ రాజ్ తక్కువ స్క్రీన్ స్పేస్ కలిగి ఉన్నప్పటికీ మెప్పించారు. మిగిలిన తారాగణం అంతా వారి పాత్ర పరిధి మేరకు బాగా చేసారు. ఈ సినిమాకు కథను బీవీఎస్ రవి అందించడం విశేషం. కానీ.. సినిమా అంతా సింగిల్ లైన్ తో సాగుతుందని దర్శకనిర్మాతలు ఎలా గ్రహించలేకపోయారు అనే సందేహం కలగకమానదు.

thank you

దర్శకుడు విక్రమ్ కుమార్ ఉన్న కథ మేరకు సింపుల్ ఎమోషన్స్‌తో చిత్రాన్ని నడిపించారు. కానీ.. నాగ చైతన్య ఫ్యాన్స్ ఆశించే అంశాలు తక్కువ అనే చెప్పాలి. తన లైఫ్ జర్నీలో ఎదుగుదలకి సహకరించిన వారికి ఎమోషనల్‌గా హీరో ఎలా థ్యాంక్యూ చెప్పాడు అనే పాయింట్ నే సినిమా అంతా సాగదీయడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్, తమన్ బిజియం ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘థాంక్యూ’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

ప్లస్‌ పాయింట్స్‌:

* నాగ చైతన్య యాక్టింగ్‌
* తమన్‌ బీజీఎమ్‌,
* పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌:

* పట్టు మిస్ అయిన కథనం
* సింగిల్ లైన్ స్టోరీ

చివరిమాట:

థ్యాంక్యూ.. ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చే సినిమా!

రేటింగ్‌: 2/5

నోట్‌: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Tags :

  • Dil raju
  • latest tollywood news
  • Naga Chaitanya
  • Rashi Khanna
  • Telugu Movie Reviews
  • Thank You Movie
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏ పొలిటికల్ పార్టీ నుంచి నిలబడ్డా ఎంపీగా గెలుస్తా.. నిర్మాత దిల్ రాజు

ఏ పొలిటికల్ పార్టీ నుంచి నిలబడ్డా ఎంపీగా గెలుస్తా.. నిర్మాత దిల్ రాజు

  • సమంత, చైతన్యల గురించి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్!

    సమంత, చైతన్యల గురించి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్!

  • ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుపై ఫైర్‌ అవుతున్న రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌!

    ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుపై ఫైర్‌ అవుతున్న రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam