రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్స్ మొదలెట్టారు. యూజ్‌లెస్ దిల్‌రాజు అనే హ్యాష్ ట్యాగును ట్రెండ్ చేస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్- దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ ప్రతీష్టాత్మక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ సినిమా 2024 సమ్మర్‌లో రిలీజ్ అవ్వబోతోందని గతంలో సినిమా టీం వెల్లడించింది.
అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో సినిమా 2024 సమ్మర్‌లో విడుదల అవ్వకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే.. రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. చరణ్ తన కూతురితో గడపడం కోసం కొన్ని రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారంట. దీంతో శంకర్ కూడా తన వేరే ప్రాజెక్టుల మీద దృష్టిపెట్టారంట. ఒక్కసారిగా ఇలా షూటింగ్‌కు బ్రేక్ పడేసరికి విడుదల తేదీ సమ్మర్‌నుంచి వాయిదా పడే అవకాశం ఉందని చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సినిమా విడుదలయ్యే వరకు ఎలాంటి అప్‌డేట్లు లేకుండా ఉండటం కష్టం కాబట్టి అప్‌డేట్ల కోసం పరితపిస్తున్నారు. ఒకరకంగా దిల్‌రాజులపై అప్‌డేట్ల కోసం యుద్ధానికి దిగారు. ఈ మేరకు సోషల్ మీడియాలో దిల్ రాజుపై ట్రోలింగ్స్ చేస్తున్నారు. ‘యూజ్‌లెస్ దిల్‌రాజు.. షేమ్ లెస్ ఏస్‌వీసీ’’ అనే హ్యాష్ ట్యాగును ట్రెండ్ చేస్తున్నారు. మరి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్ల కోసం ఆయన ఫ్యాన్స్ దిల్‌రాజుపై యుద్దానికి దిగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
More than HALF MILLION TWEETS 🙏🏻 #UselessDilRajuShamelessSVC-302.5K*
WAKE UP SHANKAR SIR – 106K*
Total cumulative count-512K(16hrs 40mins)*@AlwaysRamCharan 🔥pic.twitter.com/TjHikvuA9P— Jayanth_DHF®© (ᴳᵃᵐᵉ ᶜʰᵃⁿᵍᵉᴿ ♔) (@RcFanboi) June 25, 2023