రామ్ గోపాల్ వర్మ… ఎప్పుడు ఏ పని చేస్తాడో? ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవరికీ తెలియదు. కేవలం సినిమా గురించే కాకుండా సమాజంలో జరిగే ప్రతి అంశంపై ఇతరులకు భిన్నంగా స్పందిస్తుంటాడు. నలుగురికి నచ్చనిది.. తనకు బాగా నచ్చిందని చెప్పే రకం ఆర్జీవీ. ముఖ్యంగా మహిళల గురించి ఆర్జీవీ చేసే కామెంట్స్ చాలా వైరల్ అవడంతో పాటు.. వివాదాస్పదం కూడా అవుతుంటాయి. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరున్న ఆర్జీవీ ఈ మధ్య తరచూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఎప్పుడు ఏం చేస్తాడో, ఏలా స్పందిస్తాడో ఊహించడం కష్టం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే ఆయన అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంటాడు. అయితే పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ ఎప్పుడూ ఎదో ఒక అంశం తో సెటైర్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అడ్వాన్స్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అది కూడా వర్మ తన స్టైల్ ట్వీట్లో నే పవన్ కు విషెస్ చెప్పాడు.
ప్రతి అంశాన్ని అందరికంటే భిన్నంగా చూసే వర్మ, ఈ మధ్యకాలం బుల్లితెర యాంకరమ్మలతో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మధ్య బిగ్‌బాస్ భామ అరియానా గ్లోరీతో బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్జీవీ ఇటీవల మరో బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డిని డిఫరెంట్ యాంగిల్లో ఫొటో తీసి షాక్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాక పలువురు సినీ తారలు, నటీనటులతో ఆయన చేసే రచ్చ మాములుగా ఉండదు. సినిమా సెలబ్రేషనస్, బర్త్‌డే పార్టీలో ఆ మూవీ హీరోయిన్లతో డ్యాన్స్ చేసి హాట్‌టాపిక్‌గా మారుతాడు. తాజాగా ఇలానే మరోసారి వర్మ వార్తల్లోకి ఎక్కాడు.
పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున…ఆయనను అభిమానించే అష్షు రెడ్డి తరపున పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే…. అష్షు నాతో చేసిన ఇంటర్వ్యూ ప్రోమో సెప్టెంబర్ 2న సాయంత్రం 6 గంటలకు విడుదల అవుతుంది. జై పవన్ కళ్యాణ్..జై అష్షు రెడ్డి..” అంటూ వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక వర్మ పోస్ట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు మండి పడుతున్నారు. మరో వైపు అష్షు రెడ్డి ఈ ఫోటో పై నెటిజన్లు చేస్తున్న కామెంట్ల కు తన స్టైల్ లో సమాధానం ఇస్తోంది.
Advance birthday wishes from the @PawanKalyan girl @AshuReddi to the POWER STAR ..My promo with her releasing tmrw the September 2nd at 6.9 Pm ..JAI POWER STAR 🙏 JAI JAI ASHU RÊDDY 🙏🙏 pic.twitter.com/AGtqb3vInD
— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2021