సుకుమార్ దర్శకత్వంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలోనే కాక.. బాలీవుడ్లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమాలోని పాటలు రికార్డులు క్రియేట్ చేశాయి. కొన్ని నెలల పాటు ఎక్కడ చూసిన పుష్ప పాటలే మారుమోగాయి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తర్వాత ప్రధానంగా మాట్లుడుకున్నది, ప్రశంసలు కురిపించింది కేశవ పాత్ర గురించే. సినిమాను మొత్తం నడిపించింది ఈ క్యారెక్టరే.
ఇక పుష్ప సినిమాలో కేశవ పాత్రలో నటించింది జగదీష్ ప్రతాప్ బండారి. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా కన్నా పెద్ద కారెక్టర్ చేశాడు కేశవ. పుష్ప సినిమా కన్నా ముందు జగదీష్ పలాస 1978, మల్లేషం సినిమాలో నటించాడు. కానీ ఆ పాత్రల వల్ల అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో జగదీష్ సుకుమార్ దృష్టిలో పడటం, పుష్ప సినిమాలో అవకాశం ఇవ్వడం చకచక జరిగిపోయాయి. ఇక సినిమా విడుదలయిన తర్వాత.. కేశవ పాత్రకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.
ఈ క్రమంలో తాజాగా కేశవ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. సీరియస్ లుక్‌లో పుష్ప గెటప్‌లో ఉన్న కేశవని చూసిన వారంతా.. ఇది పుష్ప 2లో కేశవ లుక్ అయి ఉండవచ్చని భావిస్తోన్నారు. అంతేకాక దీన్ని చూసిన నెటిజనులు.. అంటే పుష్ప 2లో కేశవ.. పుష్పరాజ్‌కి వెన్నపోటు పొడవనున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయసాగారు. అయితే సోషల్ మీడియాలో వైరలవుతోన్న కేశవ లుక్ వెనక ఉన్న కథ ఏంటంటే.. ఇది పుష్ప చిత్రంలోనిది కాదు. వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగరంగ వైభవంగా చిత్రంలోనిది ఈ లుక్. ఈ సినిమాలో జగదీష్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో జగదీష్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. పుష్ప 2లో కేశవ ఇలా ఉండబోతున్నాడు అంటూ వైరల్ చేస్తున్నారు.