గ్లామర్ ప్రపంచంలో ఇదివరకు హీరోయిన్లు, మోడల్స్, ఐటమ్ గర్ల్స్ మాత్రమే సినిమాలలో అందాలను షో చేయడం చూస్తూండేవాళ్ళం. ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చేసరికి సినిమాలకు సంబంధం లేనివారు కూడా గ్లామర్ షోలో రెచ్చిపోతున్నారు.
మోడలింగ్ నుండి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టీవీ యాంకర్స్.. ఈ మధ్యకాలంలో ఫోటోషూట్స్ లో ఎలా అందాల ట్రీట్ ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఉన్న గ్లామరస్ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. టీవీ ప్రోగ్రాంలకు యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. మెల్లగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా డెబ్యూ చేసి.. ఇటీవల 'వాంటెడ్ పండుగాడ్' అనే మూవీ కూడా చేసింది.
కెరీర్ మొదట్లో పోరాపోవే ప్రోగ్రామ్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ.. 'చెక్ మేట్' అనే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే.. యాంకర్ గా కొన్నేళ్లపాటు గ్లామర్ షోకి దూరంగా ఉన్న ఈ భామ.. మొదటి సినిమాలోనే అదిరిపోయే అందాల షోతో పాటు లిప్ లాక్ సీన్స్ కూడా చేయడం విశేషం.
ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే విష్ణుప్రియ.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ట్రెండ్ తగ్గ ఫోటోషూట్స్ తో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. ఇటీవల బ్లాక్ సారీలో సెగలు రేపిన విష్ణు.. తాజాగా పింక్ సారీలో మరోసారి అందాల ట్రీట్ ఇచ్చింది.
కెరీర్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్న విష్ణుప్రియ.. స్టార్ హీరోయిన్లను మించి టాప్ టు బాటమ్ అందాలను సోషల్ మీడియాలో ఎరగా వేస్తుండటం.. అవకాశాల కోసమేనా లేక కేవలం ఫోటోషూట్స్ కోసమే ఇంతలా హాట్ షో చేస్తోందా అనే స్థాయిలో అమ్మడు ఆకట్టుకుంటోంది. విష్ణుప్రియ చూడటానికి ఎంత ముద్దుగా ఉంటుందో.. చీరకట్టినా, ట్రెండీ వేర్ లో కనిపించినా ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంటుంది. చీరలోనూ అందంగా కనిపించే ముద్దుగుమ్మలను చూశాం.. కానీ, విష్ణుప్రియ హాట్ నెస్ ముందు ఫామ్ లో ఉన్న హీరోయిన్లు కూడా దిగదుడుపే అనిపించేలా అందాల రచ్చ చేస్తోంది. ప్రస్తుతం పింక్ సారీలో విష్ణుని చూస్తూ.. అలా కైపెక్కిపోతున్నారు నెటిజన్స్.