అరియనా గ్లోరి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో ఆమె లుక్స్ పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
అరియానా గ్లోరి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్ షోతో బాగా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఆ షోలో ముక్కు అవినాష్‌తో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో రూమార్లు వచ్చాయి. వీళ్ళు షోలో చేసే స్టంట్స్ చూసి ఇది నిజమే కావచ్చు అని మరి కొందరు అభిప్రాయపడ్డారు. వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి ముక్కు అవినాష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తను నాకు మంచి ఫ్రెండ్ అని మా మధ్య ఎలాంటి సంబంధాలు లేవు ఉన్నదల్లా స్నేహ బంధమే అంటూ వివరణ ఇచ్చారు. దీంతో అదంతా వట్టి పుకార్లే అని తేలింది. అయితే మొదట అర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన అమె బాగ్‌బాస్‌తో మరింత జనాలకు దగ్గరైంది. చాలా మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో తన ఫోటోలను ఎప్పటికప్పడు షేర్ చేస్తూ.. కుర్రకారు మతి పోగుడుతూ ఉంటుంది. రకరకాల ఫోజులు ఇస్తూ గ్లామర్ డోస్ పెంచేస్తూ.. ఎప్పుడు తన ఫాలోవర్లకు సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటుది. తాజాగా అరియానా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అరియానా అభిమానులు అయితే షాక్ అవుతున్నారు. ఈమె అరియానాయేనా.. లేక ఇంకెవరైనానా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అరియానా తాజా లుక్ చూస్తే కొంచెం బొద్దుగా కనిపిస్తుంది. అభిమానులు సైతం కొందరు ఆమెపై దారుణ వాఖ్యలు చేస్తున్నారు.
షూటింగ్స్ అన్నీ పక్కన పెట్టి బాగా తిని నిద్రపోతున్నావా..? మరి ఇంత లావుగా అయ్యావ్ అంటూనే.. మరికొందరు సన్నగా ఉంటేనే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా బొద్దుగా ఉంటే సినిమా అవకాశాలు ఎలా వస్తాయి, మీరు బరువు తగ్గాలి అంటూ.. మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే అరియానా గ్లోరితో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ కూడా ఉండడంతో వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గానీ అరియనా గ్లోరి సడన్‌గా ఇంతా బొద్దుగా అవ్వడం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తన ఫ్యాన్స్ కోసం అయినా బరువు తగ్గుతుందా లేక ఇలానే ఉంటుందా?